Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

5000 మంది అన్నార్థులకు సచిన్ సాయం!!

Sachin Tendulkar Pledges To Feed 5000 People For A Month

ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రమాదకర కరోనా వైరస్‌పై పోరాడేందుకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.50లక్షల విరాళమిచ్చిన సచిన్.. తాజాగా అన్నార్థులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చాడు. నెలకు 5000 మంది అన్నార్థుల ఆకలిని సచిన్ తీర్చనున్నాడు.

5000 మందికి సచిన్ సాయం:

5000 మందికి సచిన్ సాయం:

అప్నాలయ అనే స్వచ్చంద సంస్థతో కలిసి నెలకు ఐదు వేల మందికి సరుకులు పంపిణి చేసేందుకు సచిన్‌ ముందుకొచ్చాడు. ఈ విషయాన్ని అప్నాలయ తమ అధికారిక ట్విట్టర్‌ ద్వారా పేర్కొంది. 'మా సంస్థకు సహాయం చేస్తున్నందుకు సచిన్‌కు కృతజ్ఞతలు. నెలకు ఐదు వేల మందికి అవసరమయ్యే రేషన్‌ సరుకులను సచిన్‌ సమకూరుస్తున్నాడు' అని అప్నాలయ సంస్థ ట్వీట్‌ చేసింది. మరోవైపు అప్నాలయా ద్వారా తానీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సచిన్‌ ట్వీట్‌ చేశాడు.

 ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలి:

ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలి:

అప్నాలయ తమ సేవల్ని ఇలాగే కొనసాగించి ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని సచిన్‌ టెండూల్కర్‌ ట్వీట్‌లో పేర్కొన్నాడు. 'భాగ్యులు, ఇబ్బందుల్లో ఉన్న వారికి సేవలను కొనసాగించేందుకు అప్నాలయకు మరింత మంచి జరగాలని కోరుకుంటున్నా. మంచి పనిని కొనసాగించండి' అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ కూడా కోల్‌కతాలో 10 వేల మంది కడుపు నింపేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

సహాయం చేయడంలో సచిన్ ఎప్పుడూ ముందే

సహాయం చేయడంలో సచిన్ ఎప్పుడూ ముందే

ఎప్పటినుండో సచిన్ టెండూల్కర్ చాలా ఛారిటీ సంస్థలకు తన వంతు సాయం చేసేవాడు. ప్రజలకు సహాయం చేయడంలో ఎప్పుడూ సచిన్ ముందుంటాడు. అయితే ఇది ఎప్పుడూ ప్రజల దృష్టికి మాత్రం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటానికి తమ వంతు సాయం అందించేందుకు ఇప్పటికే పలువురు క్రీడాకారులు ముందుకొచ్చారు. పఠాన్ సోదరులు 4000 ఫేస్ మాస్క్‌లను బరోడా పోలీసు మరియు ఆరోగ్య శాఖకు విరాళంగా ఇచ్చారు. ధోనీ, రైనా, గంభీర్, మిథాలీ, సింధు, సానియా ఇలా చాలా మంది సాయం చేసారు.

బయట తిరిగేందుకు సెలవులు కాదు:

బయట తిరిగేందుకు సెలవులు కాదు:

తాజాగా సచిన్ ట్విటర్‌ వేదికగా ఓ వీడియో పంచుకున్నాడు. 'ప్రభుత్వం ఎంత చెబుతున్నా.. కొందరు సీరియస్‌గా తీసుకోవడం లేదు. బయట తిరిగేందుకు ఇవి సెలవులు కాదు. బయ‌ట‌కి రావోద్ద‌ని ప్ర‌భుత్వ ఆదేశాలు ఉన్న కూడా వాటిని పాటించ‌కుండా ఎందుకు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. క‌రోనా మహ‌మ్మారితో యావ‌త్‌ దేశం మొత్తం ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిల్లో ఉంది. ఈ విష‌యాన్ని అందరూ గుర్తుంచుకోవాలి' అని పేర్కొన్నాడు.

Story first published: Saturday, April 11, 2020, 13:00 [IST]
Other articles published on Apr 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+