వరుణ్ ధావన్, అభిషేక్ బచ్చన్ బౌలింగ్.. సచిన్ బ్యాటింగ్ (వీడియో)

ముంబై: జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా గురువారం భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన 'ఫిట్ ఇండియా మూవ్‌మెంట్' కార్యక్రమానికి సచిన్ మద్దతు పలికారు. స్పోర్ట్స్ ప్లేయింగ్ నేషన్‌లో భాగంగా సచిన్ బాలీవుడ్ ప్రముఖ హీరోలతో కలిసి సరదాగా గల్లీ క్రికెట్ ఆడారు.
ధావన్, అభిషేక్ బౌలింగ్:
మెహబూబా స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ హీరోలు వరుణ్ ధావన్, అభిషేక్ బచ్చన్‌లను క్రికెట్ ఆడాలని సచిన్ ఆహ్వానించారు. దీంతో అందరూ కలిసి గల్లీ కలిసి క్రికెట్ ఆడారు. తొలుత సచిన్ బ్యాటింగ్ చేయగా.. వరుణ్, అభిషేక్‌లు బౌలింగ్ చేశారు. సచిన్ చక్కటి షాట్లతో అక్కడి వారిని అలరించారు. అనంతరం సచిన్ వారిద్దరికీ బౌలింగ్ చేసారు. ముఖ్యంగా వరుణ్ సచిన్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడారు.
యువ క్రికెటర్‌కు ఎంకరేజ్:
సచిన్ అక్కడే ఉన్న జియా అనే మహిళా యువ క్రికెటర్‌ను ఎంకరేజ్ చేశారు. ఆమెతో వరుణ్, అభిషేక్‌లకి బౌలింగ్ చేయించారు. ‘స్పోర్ట్స్ ప్లేయింగ్ నేషన్', ‘ఫిట్ ఇండియా మూవ్‌మెంట్' హాష్‌టాగ్‌లను జత చేస్తూ సచిన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 'గల్లీలో క్రికెట్ ఆడటం ఆనందంగా ఉంది. షూట్ సమయంలో వరుణ్, అభిషేక్ క్రికెట్ ఆడి ఆశ్చర్యపరిచారు. మా కోసం సమయం వెచ్చించిన వారికి ధన్యవాదాలు' అని సచిన్ ట్వీటారు.

మీతో క్రికెట్ ఆటడం సంతోషం:
ప్రస్తుతం సచిన్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌పై వరుణ్ స్పందించారు.' క్రీడా దినోత్సవం సందర్భంగా గొప్ప చొరవ చూపారు సర్. స్పోర్ట్స్ ప్లేయింగ్ నేషన్ చాలా గొప్ప కార్యక్రమం. మీతో క్రికెట్ ఆటడం చాలా సంతోషంగా ఉంది' అని రిప్లై ఇచ్చారు. ఈ వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. మైదానంలోనే కాదు బయట కూడా సచిన్ అలరించారు అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. స్ఫూర్తివంతంగా వ్యవహరించడం సచిన్‌కే సాధ్యం అని మరో అభిమాని కామెంట్ చేసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications