Sachin Tendulkar Playing 11 For IPL 2022: రోహిత్, కోహ్లీ, ధోనీ, పంత్ జాన్తానై... సచిన్ జట్టులో ఎవరున్నారంటే?

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే గెలుచుకుంది. మెగావేలం తర్వాత చాలా మంది ఈ టీం పట్ల విమర్శలు చేయగా.. ఆ విమర్శలకు గట్టిగా జవాబిస్తూ జట్టు టైటిల్ ఒడిసిపట్టింది. ఇక ఐపీఎల్ 15వ సీజన్‌లో చాలా మంది ఆటగాళ్లు అసాధారణ ప్రతిభ కనబరిచారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు అంతగా రాణించలేదు. ఇక ఈ సీజన్ ముగిసిన అనంతరం భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ 2022లో ఓవరాల్‌గా తన అత్యుత్తమ ప్లేయింగ్ 11జట్టును ప్రకటించాడు. ఇక స్టార్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోనీ, పంత్ లాంటి వాళ్లను కనీసం కూడా పరిగణనలోకి తీసుకోని సచిన్.. పూర్తిగా ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేశాడు. అతను హార్దిక్ పాండ్యాను తన జట్టు కెప్టెన్‌గా పేర్కొన్నాడు. ఈ సీజన్లో 863పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న జోస్ బట్లర్‌ను ఓపెనర్‌గా పేర్కొన్నాడు. పంజాబ్ కింగ్స్ తరఫున డీసెంట్ ఓపెనింగ్ ఇచ్చిన శిఖర్ ధావన్‌ను మరో ఓపెనర్‌గా పేర్కొన్నాడు. ధావన్ ఈ సీజన్‌లో బానే రాణించినా దక్షిణాఫ్రికా T20సిరీస్‌కు మాత్రం అతన్ని ఎంపిక చేయలేదు.

దుర్భేద్యంగా మిడిల్ ఆర్డర్
సచిన్ టెండూల్కర్ తను పేర్కొన్న జట్టులో మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్‌లను పేర్కొన్నాడు. ఇక ఈ నలుగురు ప్లేయర్లు ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రాహుల్ 600కంటే ఎక్కువ పరుగులు సాధించగా, హార్దిక్ ఆల్‌రౌండర్‌గా, కెప్టెన్‌గా సత్తా చాటాడు. ఈ సీజన్‌లో దాదాపు 500పరుగులు చేయడంతోపాటు 8వికెట్లు కూడా తీశాడు. అదే సమయంలో డేవిడ్ మిల్లర్ తన కెరీర్‌లో అత్యుత్తమ ఐపీఎల్ సీజన్ ఆడాడు. 16మ్యాచ్‌లలో 68.71సగటుతో 143స్ట్రైక్ రేట్‌తో 481పరుగులు సాధించాడు. మరోవైపు లివింగ్‌స్టోన్ సీజన్ సిక్స్‌ల మీద సిక్సులు కొడుతూ ప్రత్యర్థులను వణికించాడు. ఇక ఈ సీజన్లో 117మీటర్ల భారీ సిక్సర్ కూడా బాదాడు.

ఫినిషర్‌గా దినేష్ కార్తీక్
ఇక మరో ఫినిషర్‌గా దినేష్ కార్తీక్‌ను పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో దినేష్ కార్తీక్ అసాధారణ నిలకడతో ఫినిషర్ రోల్‌లో ఆడాడు. అతను ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోయాడు. అందుకే దినేష్ కార్తీక్‌కు ఫినిషింగ్ బాధ్యతలను సచిన్ అప్పగించాడు. కార్తీక్ మొత్తం సీజన్‌లో 183.33అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. అతను 16 మ్యాచ్‌లలో 55 సగటుతో 330పరుగులు చేశాడు. అతను రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్ కోసం భారత T20జట్టులో పునరాగమనం కూడా చేశాడు.

బౌలింగ్ దళాన్ని నడిపించేది బుమ్రా
బౌలింగ్ లైనప్‌లో సచిన్ టెండూల్కర్ జస్ప్రీత్ బుమ్రాను బౌలింగ్ దళాన్ని నడిపించే ప్లేయర్ గా పేర్కొన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లలో ముంబై అత్యుత్తమంగా రాణించనప్పటికీ బుమ్రాను మాత్రం తన ప్లేయింగ్ 11లో సచిన్ చేర్చాడు. అతను 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు. అయితే కేకేఆర్ తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల హాల్ సాధించాడు. బౌలర్లో మిగతావారిలో మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, రషీద్ ఖాన్ ఉన్నారు. వీరందరూ తమ తమ జట్లకు మంచి ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.
సచిన్ టెండూల్కర్ IPL 2022 బెస్ట్ XI: జోస్ బట్లర్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, దినేష్ కార్తీక్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications