ఇమ్రాన్‌కు తెలియదు, అతడి కెప్టెన్సీలో ఫీల్డింగ్ చేశా: సచిన్
ముంబై: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 1989 నవంబర్ 15న అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. కరాచీ నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మన లిటిల్ మాస్టర్ తన తొలి టెస్టుని ఆడాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సచిన్ అభిమానులు ఇదే నిజమని నమ్ముతారు.
అయితే కరాచీలో టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేయక ముందే సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ ఇటీవల స్వయంగా విడుదల చేసిన తన ఆటో బయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకంలో పేర్కొన్నాడు.

ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు 1987, జూన్ 2న ముంబైలో ఫెస్టివల్ మ్యాచ్ ఆడేందుకు భారత్‌కు వచ్చింది. పాకిస్థాన్ జట్టు తరుపున సచిన్ టెండూల్కర్‌ను ఇమ్రాన్ ఖాన్ ఫీల్డింగ్ చేయించాడని, ఆ విషయాన్ని 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకంలో సచిన్ పేర్కొన్నాడు.
'నాకు తెలియదు. ఇమ్రాన్ ఖాన్ ఈ విషయాన్ని గుర్తుంచుకున్నాడో లేదో. పాకిస్థాన్ జట్టు తరుపున నేను ఫీల్డింగ్ చేశాను.' అని సచిన్ తెలిపాడు. పాకిస్థాన్ క్రికెటర్లు జావేద్ మియాందాద్, అబ్ధుల్ ఖాదిర్‌లు లంచ్ బ్రేక్ సమయంలో భోజనానికి వెళడంతో ముంబైకి చెందిన ఇద్దరు లోకల్ కుర్రాళ్లను వారి స్ధానాల్లో ఫీల్డింగ్ చేయించారు.
ఫీల్డింగ్‌లో భాగంగా సచిన్‌ను లాంగ్-ఆన్‌కు బదులు మిడ్-ఆన్ పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఉంచినట్లు సచిన్ పేర్కొన్నాడు. ఆ ఇద్దరు కుర్రాళ్లలో సచిన్ టెండూల్కర్ ఒకడు. దీంతో పాటు ఈ ఫెస్టివల్ మ్యాచ్‌లో కపిల్ దేవ్ ఏవిధంగా అవుట్ అయ్యాడో ఆ విషయాన్ని కూడా సచిన్ తన పుస్తకంలో ప్రస్తావించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications