కివీస్ పిచ్‌లో మార్పులు, చల్లని గాలులు వీస్తే ఏం చేయాలంటే: కోహ్లీసేనకు సచిన సలహా

హైదరాబాద్: గత కొన్నేళ్లలో న్యూజిలాండ్‌లో పిచ్‌ల స్వభావం మారిపోయిందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు. అక్కడి పిచ్‌లు ఇప్పుడు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారిపోయాయని తెలిపాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై 2-1తేడాతో వన్డే సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా... ఆ తర్వాత కివీస్ పర్యటనకు బయల్దేరి వెళ్లింది.
ఈ పర్యటనలో భాగంగా కోహ్లీసేన 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టుల సిరిస్ ఆడనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనుంది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ "గత కొన్నేళ్లలో న్యూజిలాండ్ పిచ్‌ల్లో మార్పులొచ్చాయి. టెస్టు మ్యాచ్‌ల్లోనూ భారీ స్కోర్లు నమోదవుతున్నాయి" అని అన్నాడు.

నా తొలి పర్యటనతో పోలిస్తే
"నా తొలి పర్యటనతో పోలిస్తే వాటి స్వభావం చాలా మారింది. 2009లో ఇక్కడ పర్యటించినప్పుడు మిగిలిన పిచ్‌లతో పోలిస్తే హామిల్టన్ పిచ్ భిన్నంగా కనిపించింది. ఇప్పటికీ అది నునుపుగానే ఉంది. మిగతావి కఠినంగా మారాయి. వెలింగ్టన్, నేపియర్ పిచ్‌లు మృదుత్వాన్ని కోల్పోయాయి" అని సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు.

1990 నుంచి 2009 వరకు ఐదు సార్లు
1990 నుంచి 2009 వరకు కివీస్‌లో రికార్డు స్థాయిలో సచిన్ ఐదుసార్లు పర్యటించిన సంగతి తెలిసిందే. ఇక, ఈ పర్యటనలో టీమిండియా బౌలింగ్‌పై సచిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. "టీమిండియా మంచి స్పిన్నర్లు, పేసర్లు కలిగి ఉంది. వెల్లింగ్టన్‌లో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ చల్లని గాలులు వీస్తాయి. బౌలింగ్‌లో వైవిధ్యం కనిపిస్తుంది" అని సచిన్ చెప్పాడు.

హిత్‌కు వన్డేల్లో ఓపెనింగ్ చేసిన అనుభవం
"బ్యాట్స్‌మన్ ఏ ఎండ్ నుంచి దాడి చేయాలో గుర్తించాలి. పేసర్లకు గాలి అనుకూలించినా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాలి. గాలి వీస్తున్న వైపు నుంచి పేసర్, మరో ఎండ్ నుంచి స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించాలి. కివీస్ గడ్డపై రోహిత్‌కు వన్డేల్లో ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. అయితే, టెస్టు క్రికెట్ మాత్రం భిన్నం. కివీస్ పచ్చికతో కూడిన పిచ్‌లను రూపొందిస్తే కష్టం" అని సచిన్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications