Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తండ్రి చెప్పిన మాటలనే కుమారుడికి: అర్జున్‌కు సచిన్ టెండూల్కర్ సలహా

Sachin Tendulkar Passes Dad’s Message To Arjun || Oneindia Telugu
Sachin Tendulkar passes his fathers words of wisdom to son, advises Arjun Tendulkar to never take shortcuts

హైదరాబాద్: 'నీ జర్నీలో ఎదిగేందుకు అడ్డదారులు తొక్కొద్దు' క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్‌తో చెప్పిన మాటలివి. ప్రస్తుతం ముంబై టీ20 లీగ్స్‌లో అకాశ్ టైగర్స్ జట్టుకు ఆడుతున్న అర్జున్ టెండూల్కర్‌కు సచిన్ ఈ సలహా ఇచ్చాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టోర్నీలో భాగంగా శనివారం వాంఖడే వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ జరగనుండగా అర్జున్‌తో కలిసి ప్రాక్టీస్ సెషన్‌కి సచిన్ టెండూల్కర్ హాజరయ్యాడు. ఈ సంద‌ర్భంగా ఒత్తిడిని ఎలా ఎదుర్కొవాలో అనే దానిపై సచిన్ మాట్లాడతూ "క్రికెట్‌పై అర్జున్ చాలా మక్కువ చూపిస్తున్నాడు. చిన్న‌ప్ప‌టినుంచి ఏ విష‌యంలోనూ తనను బ‌ల‌వంత పెట్ట‌లేద‌ు" అని అన్నాడు.

"తొలుత అర్జున్ పుట్‌బాల్ ఆడేవాడు, ఆ తర్వాత అతడి ఆసక్తి చెస్‌పై మళ్లింది. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్నాడు. నేను అర్జున్‌కి చెప్పేది ఒక్కటే 'జీవితంలో నీకు నచ్చింది చెయ్.. అయితే, అడ్డదారుల్లో వెళ్లకు' అని. ఇదే మాటని నా తండ్రి (రమేశ్ టెండూల్కర్) నాకు చెప్పాడు. ఇప్పుడు అర్జున్‌కి నేను చెప్తున్నా" అని సచిన్ చెప్పుకొచ్చాడు.

"దాని కోసం హార్డ్ వర్క్ అవసరం. దీంతో పాటు నీవు ఎంత నిజాయితీ ఉన్నావు అనేది కూడా ముఖ్యం" అని సచిన్ అన్నాడు. అందరి తల్లిదండ్రులు లాగే తన కుమారుడు కూడా చక్కటి ప్రదర్శన చేయాలని తాను కూడా కోరుకుంటున్నట్లు సచిన్ తెలిపాడు. 19 ఏళ్ల అర్జున్ ఆల్ రౌండర్.

ఎడమచేతి వాటం బౌలర్ అయిన అర్జున్ ఇప్పుడిప్పుడే ఆటలో నైపుణ్యం సాధిస్తున్నాడు. డిసెంబర్ 2017లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు. అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబై టి20 క్రికెట్ లీగ్‌లో ఆకాశ్ టైగర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఈ జట్టు ఇప్పుడు సెమీస్‌కు చేరింది. ఈ టోర్నీకి ముందు నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను రూ. 5 లక్షలకు వేలంలో సొంతం చేసుకుంది.

Story first published: Monday, May 27, 2019, 19:08 [IST]
Other articles published on May 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+