Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

24 ఏళ్ల సచిన్ క్రికెట్ కెరీర్‌లో.. ఆలా జరగడం ఒక్కసారి మాత్రమే!!

Sachin Tendulkar palyed a cricket match only once on his birthday in 24 yers career

హైదరాబాద్: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ పుట్టిన రోజు నేడు. ఈ రోజుతో సచిన్ 47వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రస్తుత, సహచర ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. సచిన్ తన తల్లి రజినీ ఆశీర్వాదాన్ని ఉదయమే తీసుకున్నాడు. కాళ్లకు నమస్కరించిన సచిన్​కు ఆమె వినాయకుడి ప్రతిమను బహుమతిగా ఇచ్చారు. ఇక సచిన్‌ అభిమానుల పోస్టులతో ఆయన పేరు ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

కెరీర్‌లో ఒక్కసారే:

కెరీర్‌లో ఒక్కసారే:

సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజుసందర్భంగా.. మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. సచిన్ తన పుట్టిన రోజున ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ ఆడాడా? అని చర్చ వైరల్ అయింది. అయితే దీనికి సమాధానం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 24ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో సచిన్ ఒకే ఒక్కసారి తన పుట్టిన రోజున టీమిండియా తరఫున క్రికెట్ మ్యాచ్ ఆడాడట. 1998లో ఏప్రిల్ 24న షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ సెంచరీ బాదాడు. ముక్కోణపు వన్డే సిరీస్ సెమీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ 131 బంతుల్లో 134 పరుగులు చేశాడు.

పుట్టిన రోజు వేడుకలకు దూరం:

పుట్టిన రోజు వేడుకలకు దూరం:

24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ క్రికెట్‌కే వన్నె తెచ్చాడు. 16 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికై తన బ్యాటింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. క్రికెటంతా ఒక చరిత్ర అయితే, తనే ఓ చరిత్రగా మిగిలిపోయాడు. యావత్‌ క్రీడాభిమానులంతా సచిన్‌ను దేవుడిగా చూస్తారు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రతాపం చూపిస్తున్న తరుణంలో సచిన్‌ ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పాడు.

పాకిస్థాన్‌పై అరంగేట్రం:

పాకిస్థాన్‌పై అరంగేట్రం:

16 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికైన సచిన్.. పాకిస్థాన్‌ మీద అరంగేట్రం చేశాడు. తన పరుగుల వేటతో ఆస్ట్రేలియా ఆల్‌టైమ్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ డాన్‌బ్రాడ్‌మన్‌తో అభిమానులు తనని పోల్చుకునేలా ఎదిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. సచిన్ తన కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు చేశారు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ బాదాడు.

వన్డేల్లో తొలి ద్విశతకం:

వన్డేల్లో తొలి ద్విశతకం:

వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించాడు. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై 147 బంతుల్లో 200 పరుగులు పూర్తిచేశాడు. క్రికెట్ చరిత్రలో అప్పటివరకు ఎవరూ కూడా వన్డేలో డబుల్ సెంచరీ చేయలేదు. 2012 మార్చి 16న శతకం బాది.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌ ఆడిన క్రికెటర్‌గా కూడా సచిన్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టెస్టుల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఒకేఒక్క ఆటగాడు మాస్టర్‌ బ్లాస్టర్ కావడం విశేషం. 2012 డిసెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సచిన్.. 2013 అక్టోబర్‌లో టీ20లకు, 2013 నవంబర్‌ 13న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Story first published: Friday, April 24, 2020, 21:51 [IST]
Other articles published on Apr 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+