దేశంలోనే తొలిసారిగా: సచిన్ చేతుల మీదుగా మ్యూజియం (ఫోటోలు)
హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా కోల్‌కతాలో స్పోర్ట్స్ మ్యూజియాన్ని ఆదివారం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మ్యూజియాన్ని మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, ఒలింపిక్ పతక విజేతలు అభినవ్ బింద్రా, దీపామాలిక్, దేవేంద్ర ఝఝారియా ప్రారంభించారు.
ఈ మ్యూజియంలో క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడాకారులకు చెందిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. కోల్ కతాలోని ఇకోస్పేస్ బిజినెస్ పార్కులో ప్రదర్శనకు ఉంచిన
ఈ వస్తువులను క్రికెట్ నిపుణుడు బోరియా మజుందార్ సుమారు పాతికేళ్లపాటు కష్టపడి సేకరించాడు.
ఈ స్పోర్ట్స్ మ్యూజియాన్ని ప్రారంభించిన అనంతరం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఇండియన్ స్పోర్టింగ్ హీరోలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నాడు. ఎంతో మంది క్రీడాకారులు పసిడి, రజత, కాంస్య పతకాలను సాధించి మన దేశానికి వన్నె తెచ్చారని చెప్పాడు.
అలాంటి వారిని మనం మరిచిపోకూడదని, వారు మన మధ్య జీవించి ఉండకపోయినా మనకు ఎన్నో సందర్భాల్లో ప్రేరణగా నిలిచారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎక్కువమంది క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, యువకులు ఈ మ్యూజియంలో ఉంచిన క్రీడాకారుల మధుర జ్ఞాపకాలను చూసి స్ఫూర్తి పొందుతారని సచిన్ పేర్కొన్నాడు.

సంతోషంగా ఉంది: సచిన్ టెండూల్కర్
ఇక, క్రికెట్‌కు సంబంధించి బ్రాడ్‌మన్, లార్డ్స్ ప్రదర్శనశాలలు ఉన్నాయని, ఒక్క క్రికెట్‌కే పరిమితం కాకుండా అన్ని క్రీడలకు సంబంధించి మ్యూజియం ఏర్పాటు చేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కోల్‌కతా పుల్ మారథాన్ కోసం కోల్‌కతాకు రెండు రోజుల పర్యటన కోసం విచ్చేసిన సచిన్ ఈ మ్యూజియాన్ని సోమవారం ప్రారంభించారు.

క్రీడా చరిత్ర మొత్తం ఇక్కడ పొందుపరిచారు
ఇదిలా ఉంటే రియో ఒలింపిక్ పతక విజేత ఝఝారియా మాట్లాడుతూ భారతదేశానికి సంబంధించి క్రీడా చరిత్ర మొత్తం ఇక్కడ పొందుపరిచారని తెలిపారు. ప్రముఖ క్రీడాకారులకు సంబంధించిన వస్తువులు ఈ మ్యూజియంలో ఉంచారని వివరించారు. ఒలింపిక్ పతక విజేత బింద్రా మాట్లాడుతూ గతంలో తాను లాసన్నె ఒలింపిక్ మ్యూజియంలో ఎక్కువ సమయాన్ని గడిపానని గుర్తు చేసుకున్నారు.

బింద్రాకు చెందిన రెండు వస్తువులు ప్రదర్శనలో
బింద్రాకు చెందిన రెండు వస్తువులను ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. మరోవైపు రియో పారాలింపిక్స్‌లో పతకం గెలిచినప్పుడు ధరించిన జెర్సీని దీపామాలిక్ ఈ మ్యూజియం ప్రదర్శనలో ఉంచేందుకు ఇవ్వడం విశేషం. మరోవైపు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 100వ సెంచరీ చేసిన సమయంలో ధరించిన గ్లౌజులను ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.

6700 చదరపు అడుగుల ప్రాంతంలో మ్యూజియం ఏర్పాటు
పీవీ సింధు సిల్వర్ మెడల్ సాధించిన సమయంలో ధరించిన జెర్సీని సైతం ప్రదర్శనకు ఉంచారు. 6700 చదరపు అడుగుల ప్రాంతంలో ఉన్న ఈ మ్యూజియాన్ని సోమవారం మినహా అన్ని రోజుల్లో సందర్శకులు సందర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు రూ. 50, ఇతరులకు రూ. 100 టికెట్టు ధర నిర్ణయించినట్లు మ్యూజియం నిర్వాహకులు వెల్లడించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications