హైదరాబాద్: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ ఆల్‌టైమ్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు. స్వాన్ ప్రకటించిన జట్టులో భారత్ నుంచి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఒక్కడే ఎంపికయ్యాడు. జట్టు ప్రకటన అనంతరం స్వాన్ మాట్లాడుతూ తన తరంలో సచిన్ అత్యుత్తమ ఆటగాడని ప్రశంసలు కురిపించాడు.
లారా కంటే సచిన్‌కే బౌలింగ్ చేయడాన్ని తాను గౌరవంగా భావిస్తానని చెప్పాడు. స్వాన్ ప్రకటించిన జట్టులో నలుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లు, ముగ్గురు ఇంగ్లాండ్ క్రికెటర్లు, ముగ్గురు వెస్టిండిస్ ఆటగాళ్లు చోటు దక్కించుకోగా, భారత్, పాకిస్థాన్ నుంచి ఒక్కోక్కరిని ఎంపిక చేశాడు.
ఆస్ట్రేలియా నుంచి దిగ్గజ బ్యాట్స్‌మెన్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్, అడమ్ గిల్‌క్రిస్ట్, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్‌లను ఎంపిక చేయగా, ఇంగ్లాండ్ నుంచి జాక్ హాబ్స్, స్వాన్, జేమ్స్ అండర్సన్‌లు ఉన్నారు. ఇక వెస్టిండిస్ నుంచి గ్రీనిడ్జ్, సాబర్స్, బ్రియాన్ లారాలకు చోటు కల్పించాడు.

స్వాన్ తన డ్రీమ్ జట్టులో ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుకు ఆడుతున్న పేసర్ జేమ్స్ అండర్సన్‌కు కూడా చోటు కల్పించాడు. ఆండర్సన్‌ను 12వ ఆటగాడిగా ఎంపిక చేశాడు. ఇంగ్లాండ్ తరుపున 60 టెస్టులాడిన స్వాన్ 255 వికెట్లు, 79 వన్డేల్లో 104 వికెట్లు తీసుకున్నాడు.
స్వాన్ ఆల్‌టైమ్ ఎలెవన్ జట్టు:
సర్ జాక్ హాబ్స్, గోర్డాన్ గ్రీనిడ్జ్, సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్, బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్, సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ (వికెట్ కీపర్), షేన్ వార్న్, గ్రేమ్ స్వాన్, గ్లెన్ మెక్‌గ్రాత, వసీం అక్రమ్, జేమ్స్ అండర్సన్ (12వ ఆటగాడు).