భారతరత్నపై సచిన్: అందిన ఆనంద క్షణాలు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మంగళవారం భారతరత్న పురస్కారం అందుకున్న తర్వాత స్పందిస్తూ... ఈ పురస్కారం తన తల్లితో పాటు దేశంలోని అందరి తల్లులకు అంకితమన్నారు. భారతరత్న వంటి అత్యున్నత పురస్కారం అందుకోవడం గొప్ప వరంగా భావిస్తున్నానని తెలిపారు.
దేశ ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండేందుకు తాను తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. తనతో పాటు భారతరత్న అందుకున్న సిఎన్ఆర్ రావు గారు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని సచిన్ టెండుల్కర్ అన్నారు.
కాగా, బ్యాటింగ్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త సిఎఎన్ఆర్ రావులకు మంగళవారం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ పురస్కార కార్యక్రమానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు.
సిఎన్ఆర్ రావుకు రసాయన శాస్త్రంలో ఈ పురస్కారం లభించింది. మరో పక్క కేంద్ర హోంశాఖ సోమవారం భారతరత్నపై మార్గదర్శకాలను జారీ చేసింది. పురస్కార గ్రహీతలు తమ బయోడేటాలు, లెటర్ హెడ్, విజిటింగ్ కార్డుల్లో రాష్ట్రపతి నుంచి భారతరత్న అందుకున్నట్లు లేదా భారతరత్న పురస్కార గ్రహీత అని ప్రస్తావించవచ్చునని స్పష్టం చేసింది.

సిఎన్ఆర్ రావు
ప్రముఖ శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

సచిన్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ప్రముఖ శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావు కూడా అందుకున్నారు.

సచిన్
బ్యాటింగ్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు మంగళవారం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. ఈ సమయంలో రాష్ట్రపతికి నమస్కరిస్తున్న సచిన్ టెండుల్కర్.

సచిన్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ప్రముఖ శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావు కూడా అందుకున్నారు.

సచిన్
బ్యాటింగ్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త సిఎఎన్ఆర్ రావులకు మంగళవారం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. మాట్లాడుకుంటున్న సచిన్, రావులు.

సచిన్
క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మంగళవారం భారతరత్న పురస్కారం అందుకున్న తర్వాత స్పందిస్తూ... ఈ పురస్కారం తన తల్లితో పాటు దేశంలోని అందరి తల్లులకు అంకితమన్నారు. భారతరత్న వంటి అత్యున్నత పురస్కారం అందుకోవడం గొప్ప వరంగా భావిస్తున్నానని తెలిపారు.

మోరదాబాద్ పాఠశాల విద్యార్థులు
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానం చేశారు. ఆ ఆనంద సమయాల్ని పంచుకుంటున్న మోరదాబాద్ పాఠశాల విద్యార్థులు.

మోరదాబాద్ పాఠశాల విద్యార్థులు
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానం చేశారు. ఆ ఆనంద సమయాల్ని పంచుకుంటున్న మోరదాబాద్ పాఠశాల విద్యార్థులు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications