శ్రీవారిని దర్శించుకున్న సచిన్: చూసేందుకు ఎగబడ్డ జనం
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. తన భార్య అంజలితో కలసి ఆయన ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు.

సచిన్ దంపతులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం
ఈ సందర్భంగా సచిన్ దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి, ఆలయంలోకి తీసుకెళ్లారు. టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు.

వేదపండితులచే ఆశీర్వచనం
దర్శనానంతరం ఆలయరంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్దప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.

శ్రీవారిని దర్శనం బాగా జరిగింది
అనంతరం సచిన్ మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారిని దర్శనం బాగా జరిగిందని సచిన్ పేర్కొన్నారు. గురువారం జరగబోయే ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో పాల్గొనబోయే భారత జట్టుకు సచిన్ శుభాకాంక్షలు తెలిపారు.

చూసేందుకు ఎగబడ్డ జనం
సచిన్‌తో పాటు చాముండేశ్వరినాథ్, నిమ్మగడ్డ ప్రసాద్‌లు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సచిన్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications