For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అమ్మకానికి సిద్ధమైన సచిన్ వాటా!!

Sachin Tendulkar moves away from ISL team Kerala Blasters

న్యూఢిల్లీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ జట్టు కేరళ బ్లాస్టర్స్‌‌లోని తన వాటాను సచిన్‌ టెండూల్కర్‌ త్వరలోనే విక్రయించబోతున్నాడు. 2018 సీజన్‌ మొదలయ్యేలోపే తన వాటాను అమ్మేయాలని సచిన్‌ నిర్ణయించుకొన్నట్టు ఐఎస్ఎల్‌ ఉన్నతాధికారి తెలిపారు. ఈ క్లబ్‌లో సచిన్‌కు తొలుత 40 శాతం వాటా ఉండగా.. ఇందులోనుంచి 20శాతం వాటాను తెలుగు సినీ ప్రముఖులు కొందరు 2016లో కొనుగోలు చేశారు.

ఇప్పుడా మిగిలిన 20 శాతం వాటాను కూడా సచిన్‌ అమ్మకానికి ఉంచాడు. పుట్‌బాల్‌కి భారత్‌లో ఎక్కువ ప్రచారం కలిపించే భాగంలో ఇండియన్ సూపర్ లీగ్ పేరిట ఓ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సూపర్ లీగ్‌లో మొత్తం 8 జట్లు ఉన్నాయి. మాజీ క్రికెట్ ఆటగాళ్లైన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ ఇందులో రెండు జట్లకు యజమానులుగా ఉన్నారు.

వీరితో పాటు విరాట్ కోహ్లీ కూడా ఎఫ్‌సి గోవా ప్రాంఛైజీకి సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ స్వయంగా తెలిపారు. ముంబైలో టీమ్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ 'ఇది తీసుకున్న వాళ్లలో నేనే కుర్రవాడిని, నాకు పుట్‌బాట్ అంటే ఇష్టం ఇండియాలో పుట్‌బాల్‌ పెరగాలి" అని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

'ఇండియన్ సూపర్ లీగ్ ద్వారా భారత ఆటగాళ్లకు అంతర్జాతీయ మహామహుల ఆటగాళ్లతో ఆడే అవకాశం లభిస్తుంది' అని అన్నాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ సహా యజమాని కాగా, అథ్లెటిక్ డీ కోల్ కత్తా జట్టుకు సౌరవ్ గంగూలీ సహా యజమానిగా ఉన్నారు. ఇక ఎఫ్‌సి గోవా ప్రాంఛైజీకి కోచ్‌గా బ్రెజిలియన్ లెజెండ్ జికో ఉన్నారు.

ఇప్పుడు ఈ 20 శాతం వాటాను కూడా సచిన్‌ ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తకు అమ్మ‌నున్న‌ట్లు బ్లాస్ట‌ర్స్ వ‌ర్గాలు తెలిపాయి. లులూ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ అధినేత మహ్మద్ యూసుఫ్ అలీ స‌చిన్ వాటాను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు

Story first published: Sunday, September 16, 2018, 12:55 [IST]
Other articles published on Sep 16, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+