లండన్: మీరెప్పుడైనా ఊహించరా? క్రికెట్ దిగ్గజం లిఫ్ట్ కోసం ఓ బస్సు స్టాప్‌లో ఎదురు చూస్తారని? అయితే అది ఇప్పుడు జరిగింది. కానీ, అది మాత్రం భారతదేశంలో కాదు.. ఇంగ్లాండ్‌లోని లండన్‌లో.
వింబుల్డన్ టోర్నీమెంటును చూసేందుకు ఇంగ్లాండ్ వెళ్లిన సచిన్ టెండూల్కర్.. జులై 11న అతను వెళ్లే చివరి బస్సు మిస్ కావడంతో గ్రేట్ హసేలే ఆక్స్‌ఫర్డ్‌ఫైర్ బస్సు స్టాప్ వద్ద లిఫ్ట్ కోసం వేచిచూస్తూ కూర్చున్నారు. ఈ సమయంలోనే తనకు ఎవరైనా లిఫ్ట్ ఇవ్వండి అంటూ తన ట్విట్టర్‌లో సచిన్ ట్వీట్ కూడా చేశారు.
'గ్రేట్ హసేలే ఆక్స్‌ఫర్డ్‌ఫైర్‌లో నేను చివరి బస్సును మిస్సయ్యా. నాకు ఎవరైనా లిఫ్ట్ ఇవ్వండి' అని టెండూల్కర్ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో శనివారం పేర్కొన్నారు. బస్సు స్టాప్‌లో కూర్చున్న ఫొటోలను కూడా ఆ ట్వీట్‌లో పెట్టారు.

క్రికెట్ దేవుడి ట్వీట్‌కు భారతదేశంలోని అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. అయితే లండన్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్‌కు ఎలా లిఫ్ట్ ఇచ్చేదనే ఆలోచనలో పడ్డారు. ఒక వేళ తాము అక్కడుంటే తప్పకుండా లిఫ్ట్ ఇచ్చేవారమంటూ రిట్వీట్లతో ముంచెత్తారు.
సచిన్ టెండూల్కర్, తన భార్య అంజలి, టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని ప్రియురాలు అనుష్క శర్మ శుక్రవారం జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన విషయం తెలిసిందే.