మ్యాచ్ చూసేందుకు రండి: కేరళ సీఎంను కలిసిన సచిన్
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురువారం (నవంబర్ 2)న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిశాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా కేరళ బ్లాస్టర్స్ టీమ్ గురించి ముఖ్యమంత్రికి వివరించడానికి ఇక్కడికి వచ్చినట్లు సచిన్ చెప్పాడు.
ఐఎస్ఎల్‌లో కేరళ బ్లాస్టర్స్ జట్టుని సచిన్ టెండూల్కర్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. లీగ్‌లో భాగంగా కేరళ జట్టు తమ తొలి మ్యాచ్ నవంబర్ 17న కోల్‌కతాతో ఆడుతుంది. ఈ మ్యాచ్ చూసేందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని సచిన్ కోరినట్లు తెలిపాడు.

ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో సచిన్ వెంట భార్య అంజలి కూడా ఉన్నారు. ఈ జట్టుకు సచిన్‌తోపాటు టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ సహ యజమానులుగా ఉన్నారు. ఇండియన్ సూపర్ లీగ్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. పది నగరాలు ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. గత ఏడాది నిర్వహించిన ఐఎస్‌ఎల్ టోర్నీలో కోల్‌కతా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కొచ్చిలో కేరళ-కోల్‌కతా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో కోల్‌కతా విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications