Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వర్షంతో ఆట రద్దు: సచిన్ అసంతృప్తి, గంట మోగించలేకపోయాడు

Sachin Tendulkar Left Disappointed as Rain Spoils Lords Debut

లండన్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ప్రారంభం కావాల్సిన రెండో టెస్టు తొలి రోజు వర్షం కారణంగా రద్దవడంపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో ఏదైనా మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఐదు నిమిషాల పాటు గంట మోగిస్తారు.

పర్యాటక జట్టుకు సంబంధించిన వారు ఎవరైనా గంటను మోగించి లాంఛనంగా మ్యాచ్‌ను ప్రారంభించడం ఎప్పటి నుంచో ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఐదు రోజులు జరిగే టెస్టు మ్యాచ్‌ సమయంలోనూ ప్రతి రోజూ ఇలా ఎవరో ఒకరు గంట మోగిస్తారు.

1
42375

గంట మోగించే అవకాశాన్ని కోల్పోయిన సచిన్

అయితే, తొలి రోజు గంట మోగించి మ్యాచ్‌ను ప్రారంభించాల్సిందిగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌‌ను మైదానం నిర్వాహకులు అడిగితే వెంటనే ఒప్పుకున్నాడు. సచిన్ టెండూల్కర్‌కు ఈ అవకాశం రావడం ఇదే తొలిసారి. అయితే తొలిరోజు కనీసం టాస్ కూడా పడకుండా ఆట రద్దవడంతో గంట మోగించే అవకాశాన్ని సచిన్ కోల్పోయాడు.

సచిన్ టెండూల్కర్ అసంతృప్తి

దీనిపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. కనీసం తర్వాతి నాలుగు రోజులైనా మ్యాచ్ జరగాలని ఆశిస్తున్నా అని మాస్టర్ అన్నాడు. సచిన్ కాకుండా గతంలో గవాస్కర్, పటౌడీ జూనియర్, దిలీప్ వెంగ్‌సర్కార్, రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీలు లార్డ్స్‌లో గంట మోగించి మ్యాచ్‌లను ప్రారంభించారు.

ఇంగ్లీషు గడ్డపై తన తొలిటెస్టుని లార్డ్స్‌లో ఆడిన సచిన్

ఇంగ్లీషు గడ్డపై తన తొలిటెస్టుని లార్డ్స్‌లో ఆడిన సచిన్

1990లో సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్‌తో ఆడిన తన తొలి టెస్టు మ్యాచ్‌ని లార్డ్స్‌లోనే ఆడాడు. ఆ తర్వాత 2010లో మాస్టర్‌కు మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సచిన్‌ను గౌరవ జీవితకాల సభ్యుడిగా చేసింది. ఇక 2014లో లార్డ్స్‌లోనే జరిగిన బెనిఫిషరీ మ్యాచ్‌లో ఎంసీసీ జట్టుకు సచిన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

 2007 నుంచి లార్డ్స్‌లో ఇలా

2007 నుంచి లార్డ్స్‌లో ఇలా

షేన్ వార్న్ నాయకత్వం వహించిన రెస్టాఫ్ ఆఫ్ ద వరల్డ్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2007 నుంచి లార్డ్స్‌లో ఇలా ఓ అంతర్జాతీయ క్రికెటర్ లేదా ప్రముఖుల చేత మ్యాచ్‌కు ముందు ఐదు నిమిషాల పాటు గంట మోగించడం ఆనవాయితీగా మార్చారు.

లార్డ్స్‌లో టీమిండియా రికార్డు పేలవం

లార్డ్స్‌లో టీమిండియా రికార్డు పేలవం

ఇదిలా ఉంటే, ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో లార్డ్స్ టెస్టులో గెలవడం ద్వారా సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా కెప్టెన్ కోహ్లీ భావిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ మైదానంలో 17 టెస్టులాడిన భారత్ కేవలం రెండింటిలోనే గెలిచింది. నాలుగు డ్రా కాగా, 11 మ్యాచుల్లో ఓడింది.

Story first published: Friday, August 10, 2018, 12:57 [IST]
Other articles published on Aug 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+