నేను చేస్తుందే మీరూ చేయండి.. ప్రజలకు సచిన్ విజ్ఞప్తి!!

ముంబై: మహమ్మారి కరోనా (కొవిడ్-19) వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు 21 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. కుటుంబంతో పాటు 21 రోజులు ఇంట్లోనే ఉంటున్నానని, దేశ ప్రజలు కూడా ఎవరింట్లో వాళ్లుండాలని సచిన్ కోరాడు. ఈ మేరకు సచిన్ ఓ పోస్ట్ చేసాడు.

బయట తిరిగేందుకు సెలవులు కాదు:
తాజాగా సచిన్ ట్విటర్ వేదికగా ఓ వీడియో పంచుకున్నాడు. 'ప్రభుత్వం ఎంత చెబుతున్నా.. కొందరు సీరియస్‌గా తీసుకోవడం లేదు. బయట తిరిగేందుకు ఇవి సెలవులు కాదు. బయటకి రావోద్దని ప్రభుత్వ ఆదేశాలు ఉన్న కూడా వాటిని పాటించకుండా ఎందుకు బయటకు వస్తున్నారు. కరోనా మహమ్మారితో యావత్ దేశం మొత్తం ప్రమాదకర పరిస్థితిల్లో ఉంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి' అని సచిన్ పేర్కొన్నాడు.

21 రోజులు ఇంట్లోనే ఉండండి:
'అందరం కలిసికట్టుగా పోరాడితేనే కరోనాను దేశం నుంచి తరిమికొట్టగలం. అందుకే అందరూ కూడా అత్యవసరం అయితే తప్ప 21 రోజుల పాటు బయటకు రావొద్దు. దయచేసి ప్రభుత్వ ఆదేశాలను తప్పని సరిగా పాటించాలి. వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు మనకోసం ప్రాణాలను లెక్కచేయకుండా పని చేస్తున్నారు. మనం అందరం కూడా బాధ్యతగా ఉండాలి' సచిన్ సూచించాడు. కుటుంబంతో పాటు 21 రోజులు ఇంట్లోనే ఉంటున్నానని, ప్రజలు కూడా ఎవరింట్లో వాళ్లుండాలని ఆయన కోరాడు.

క్రమశిక్షణతో పాటు సంకల్పబలం అవసరం:
అంతకుముందు కూడా సచిన్ ఓ ట్వీట్ చేశాడు. చిన్న విషయాలు చేయడానికి చాలా కష్టమని, అలా చేయాలంటే స్థిరమైన క్రమశిక్షణతో పాటు సంకల్పబలం అవసరమని చెప్పాడు. ప్రధాని మోదీ చెప్పినట్లు చేస్తే లక్షల మంది జీవితాలు కాపాడొచ్చని తెలిపాడు. కరోనాపై యుద్ధం చేయడానికి అందరం కలిసికట్టుగా ఉందామని సచిన్ పిలుపునిచ్చారు. అంతకుముందు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సైతం ట్విటర్‌లో మాట్లాడుతూ దేశ ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు పలు సూచనలు చేశాడు. ప్రస్తుతం మనమంతా పరీక్షాకాలంలో ఉన్నామని, అయినా సమష్టిగా పోరాడదామని తెలిపాడు.

హెచ్చరికలు చేసినా:
ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇష్టానుసారంగా బయటకు వచ్చి తిరుగుతున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో ఇప్పటి వరకు 606 కేసులు నమోదు కాగా.. 10 మంది మృతిచెందారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications