
హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభలో మాట్లేడుందుకు ప్రయత్నించగా ఆటంకాలు ఎదురైయ్యాయి. గురువారం తొలిసారి ప్రసంగించేందుకు సిద్ధమైన సచిన్‌కు నిరాశ ఎదురైంది. రాజ్యసభలో ఏం చెప్పాలనుకున్నాడో శుక్రవారం తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
క్రీడలను ప్రేమించే దేశంగా పేరున్న ఇండియాను క్రీడలను ఆడే దేశంగా మార్చడం తన బాధ్యత అని ఆ వీడియో సందేశంలో సచిన్ చెప్పాడు. తన ఈ కలను అందరి కలగా మార్చుకోవాలని, ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చాడు. మహిళలు సైతం క్రీడల్లో బాగా రాణిస్తున్నారని కొనియాడాడు. వారికి ఇంకొంచెం ప్రోత్సాహమిస్తే మరింత అభివృద్ధి కనబరుస్తారని నమ్మకాన్ని వెలిబుచ్చాడు. ఈ వీడియోలో భారత జట్టు మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్, టెన్నిస్ ప్లేయర్‌లను, బాక్సర్ మేరీకోమ్‌ల పేర్లు ప్రస్తావించాడు. తనకు క్రికెట్ అంటే ప్రాణమని, దానిని గుర్తించి తనకు ఆడే స్వేచ్ఛను, హక్కును ఇచ్చిన తన తండ్రి రమేష్ టెండూల్కర్‌కు తానెప్పుడూ రుణపడి ఉంటానని సచిన్ అన్నాడు.
సంబంధిత వీడియోపై ప్రముఖ గాయని లతా మంగేశ్కర్ స్పందించారు. సచిన్ అభిప్రాయం చాలా గొప్పదని కొనియాడారు. ఆవిడతో పాటు పలువురు ప్రముఖులు స్పందించి తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా ఇలా పంచుకున్నారు.
ఓ మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ అయిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పోస్ట్‌కు వివిధ రంగాల నుంచి స్పందనలు వచ్చాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.