Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

100వ స్టంపింగ్: సచిన్‌తో సహా ధోనిపై ఎవరేమన్నారు?

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వన్డే చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 100 స్టంపౌట్స్ చేసిన ఏకైక వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. శ్రీలంకతో ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక క్రికెటర్ ధనంజయని స్టంపౌట్ చేయడం ద్వారా ధోని ఈ రికార్డు అందుకున్నాడు.

ఈ సిరీస్‌లోనే 99 స్టంపౌట్స్‌తో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కరని సమం చేసిన ధోని, తాజాగా స్టంపింగ్‌తో అతడి రికార్డుని అధిగమించాడు. లంక ఇన్నింగ్స్ లో భాగంగా 45 ఓవర్ చివరి బంతికి దనంజయను ధోని స్టంపింగ్ చేశాడు. చాహల్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి షాట్ కోసం ధనంజయ ప్రయత్నించాడు.

అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి నేరుగా ధోని చేతుల్లోకి వెళ్లింది. క్షణాల వ్యవధిలోనే ధోని వికెట్లను గీరాటేయడంతో అతని ఖాతాలో వంద స్టంపౌట్స్ చేరాయి. వన్డే క్రికెట్‌లో 100 స్టంపింగ్‌లు పూర్తి చేసిన తొలి వికెట్‌ కీపర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు.2004, డిసెంబరు 23న వన్డేల్లోకి అరంగేట్రం చేసిన మహేంద్రసింగ్ ధోని తన కెరీర్‌లో 301వ వన్డేలో ఈ ఘనత సాధించాడు.

సంగక్కర 404 వన్డేల్లో 99 స్టంపింగ్‌లతో రెండో స్ధానంలో నిలవగా, ఆ తర్వాతి స్ధానాల్లో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ రోమేశ్ కల్వితరణ (189 మ్యాచ్‌ల్లో 75 స్టంపింగ్‌లు), పాకిస్థాన్‌కు చెందిన మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ (219 మ్యాచ్‌ల్లో 73 స్టంపింగ్‌లు), ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ (287 మ్యాచ్‌ల్లో 55 స్టంపింగ్‌లు) ఉన్నారు.

ధోని ప్రపంచ రికార్డు నెలకొల్పిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ధోనిని ప్రశంసించిన వారిలో సచిన్ టెండూల్కర్, మహమ్మద్ షమీ, హేమాంగ్ బదానీ, చెన్నై సూపర్ కింగ్స్‌లు ఉన్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+