Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు: గవాస్కర్‌తో పోల్చి రిటైర్మెంట్‌పై సచిన్ ఇలా చెప్పాడు

హైదరాబాద్: ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలనేదే తన డ్రీమ్ అని క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌ అన్నారు. కెరీర్ ముగిశాక తీరిక లేకుండా గడుపుతున్నానని పేర్కొన్నారు. ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ 'లింక్‌డ్‌ఇన్‌'లో చేరిన సందర్భంగా సచిన్ తన మనసులోని మాటలను వెల్లడించారు.

సచిన్ 'లింక్‌డ్‌ఇన్‌' అకౌంట్ ఇదే: మీరు ఫాలో అవ్వండి

క్రికెట్‌కు వీడ్కోలుపై తన మనసు, శరీరం సంకేతాలిచ్చాయని, 2013 ఛాంపియన్స్‌ లీగ్‌ సందర్భంగా తొలిసారి వీడ్కోలు ఆలోచన వచ్చిందని సచిన్‌ చెప్పాడు. 'అక్టోబరు 2013.. ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 మ్యాచ్‌ కోసం ఢిల్లీ వచ్చాను. ప్రతి రోజు ఉదయం జిమ్‌కు వెళ్లడం నాకు అలవాటు. 24 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌ అలాగే సాగింది' అని సచిన్ అన్నాడు.

ఆ రోజు ఉదయం ఏదో మార్పు

ఆ రోజు ఉదయం ఏదో మార్పు

అయితే ఆ రోజు ఉదయం ఏదో మార్పు కనిపించింది. జిమ్‌కు వెళ్లేందుకు మనసు రావడం లేదు. అయినా బలవంతంగా జిమ్‌కు వెళ్లాల్సి వచ్చింది. వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందా? గత కొన్నేళ్లుగా నాలో భాగమైన ఆట ఇక నా రోజువారీలో భాగం కాలేకపోతుందా? దానికి సూచనలే ఇవి అనిపించింది' అని అన్నాడు.

గవాస్కర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి

గవాస్కర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి

'అప్పుడు సునీల్ గవాస్కర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఓ మ్యాచ్‌ సందర్భంగా గవాస్కర్‌ భోజనం, టీ విరామం కోసం సమయం ఎంత ఉందని పదేపదే చూశాడట. అప్పుడే అతడు నిర్ణయించుకున్నాడట ఇక రిటైర్మెంట్‌ ప్రకటించే సమయం వచ్చిందని. ఆరోజు అతడు ఏం చెప్పాడన్నది నాకిప్పుడు అర్థమైంది' అని సచిన్ తెలిపాడు.

వీడ్కోలు సమయం ఆసన్నమైంది

వీడ్కోలు సమయం ఆసన్నమైంది

'వీడ్కోలు సమయం ఆసన్నమైందని ఆ రోజు ఉదయం నా మనసు, శరీరం సంకేతాలిచ్చాయి. స్టేడియంలోకి అడుగుపెడుతుంటే అభిమానులు సచిన్‌, సచిన్‌ అంటూ అరవడం ఓ గొప్ప అనుభూతి. వీడ్కోలు పలికితే అది దూరమవుతుంది. అందుకు నేను సిద్ధమా? అని ఆలోచించాను. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించి కఠిన నిర్ణయం తీసుకున్నా' అని సచిన్ అన్నాడు.

బట్టల ఇస్త్రీ నుంచి అన్ని పనులు నేనే సొంతంగా చేసుకునేవాణ్ని

బట్టల ఇస్త్రీ నుంచి అన్ని పనులు నేనే సొంతంగా చేసుకునేవాణ్ని

‘బ్యాగ్‌ సర్దుకోవడంనుంచే నా ప్రయాణం ప్రారంభమైంది. బట్టల ఇస్త్రీ నుంచి అన్ని పనులు నేనే సొంతంగా చేసుకునేవాణ్ని. ఆ తర్వాత అదే అలవాటుగా మారిపోయింది అని అన్నారు. ఇక తన రెండో ఇన్నింగ్స్ సంతృప్తికరంగా సాగుతోందని సచిన్ వెల్లడించాడు.

ప్రస్తుతం టెక్నాలజీపై దృష్టిపెట్టాను

ప్రస్తుతం టెక్నాలజీపై దృష్టిపెట్టాను

‘ప్రస్తుతం టెక్నాలజీపై దృష్టిపెట్టాను. ఆరోగ్యం, ఫిట్‌నెస్, లైఫ్‌స్టయిల్, క్లాతింగ్‌ ఇలా అభిరుచి ఉన్న రంగాల్లో ప్రవేశించాను. ఇందులో నా ఆలోచనల్ని పంచుకుని అవసరమైన వాటి తయారీలో భాగస్వామినవుతున్నాను' అని సచిన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+