న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీపై ఎక్కువ ఆధారపడొద్దు, N0.4 స్పాట్‌లో ఎవరు?: సచిన్ సూచన

Sachin Tendulkar issues stark warning to Virat Kohli & Co ahead of ICC World Cup 2019


హైదరాబాద్:
వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై అతిగా ఆధారపడొద్దని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు టీమిండియా మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన బృందంతో పాటు హెడ్ కోచ్‌ రవిశాస్త్రి, జట్టు సపోర్టింగ్ స్టాఫ్‌తో ఇంగ్లాండ్‌‌కు బయల్దేరి వెళ్లింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ వరల్డ్‌కప్‌ టైటిల్ ఫేవరేట్ జట్టలో టీమిండియా కూడా ఒకటి. ధోని నాయకత్వంలోని టీమిండియా చివరగా 2011లో వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచింది. 8 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ వరల్డ్‌కప్ టైటిల్ నెగ్గేందుకు భారీ అంచనాల మధ్య ఇంగ్లాండ్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో క్రికెట్ లెజెండ్ సచిన్ ప్రముఖ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడాడు.

సమిష్టి కృషితో ముందుకు సాగాలి

సమిష్టి కృషితో ముందుకు సాగాలి

"ప్రతి మ్యాచ్‌లోనూ సమిష్టి కృషితో ముందుకు సాగుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాలి. ఎవరో ఒకరు వ్యక్తిగతంగా రాణిస్తే సరిపోదు. ముఖ్యంగా వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో జట్టు సమిష్టి ప్రదర్శన చేయాలి. అలా జరగని పక్షంలో నిరాశ తప్పదు" అని సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.

N0.4 స్పాట్‌లో ఎవరు?

N0.4 స్పాట్‌లో ఎవరు?

జట్టులో N0.4 స్పాట్‌లో ఎవరు ఆడాలనే దానిపై చర్చ అనవసరం అని సచిన్ చెప్పాడు. వరల్డ్‌కప్‌ లాంటి మెగా టోర్నీలో ఎంతో కీలకమైన N0.4 స్పాట్‌లో విజయ్ శంకర్‌ను ఆడించడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సచిన్ "మనకు బ్యాట్స్‌మన్ ఉన్నారు. వారి పని వారు చేస్తారు. N0.4 స్పాట్‌ అనేది ఒక నెంబర్ మాత్రమే" అని చెప్పాడు.

పరిస్థితులను అంచనా వేయడమే కీలకం

పరిస్థితులను అంచనా వేయడమే కీలకం

"నాలుగో నెంబర్ స్థానంలో ఎలాంటి ప్రాబ్లమ్ చూడలేదు. మన కుర్రాళ్లు ఇప్పటికే చాలా క్రికెట్ ఆడారు. No 4, 6 లేదా 8 స్థానాల్లో ఎవరిని ఆడించాలో వారికి తెలుసు. పరిస్థితులను అంచనా వేయడమే ఇక్కడ కీలకం" అని సచిన్ పేర్కొన్నాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది.

మే 25న న్యూజిలాండ్‌తో తొలి వార్మప్ మ్యాచ్

మే 25న న్యూజిలాండ్‌తో తొలి వార్మప్ మ్యాచ్

టోర్నీకి ముందు టీమిండియా మే 25న న్యూజిలాండ్‌తో, మే 28న బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. విరాట్‌ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి.

రౌండ్ రాబిన్ పద్ధతిలో

రౌండ్ రాబిన్ పద్ధతిలో

డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.

Story first published: Wednesday, May 22, 2019, 18:30 [IST]
Other articles published on May 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X