
టెండూల్కర్‌కే ఓటు:
'ఇది చాలా కఠినమైన విషయం. టెస్టుల్లో కుమార సంగక్కర, సచిన్ టెండూల్కర్ ఇద్దరూ ఐకాన్ ఆటగాళ్లు గానే పేరు పొందారు. కానీ 21వ శతాబ్దపు గొప్ప బ్యాట్స్‌మన్‌గా నేను మాత్రం నా తోటి ముంబైకర్ సచిన్ రమేష్ టెండూల్కర్‌కే ఓటు వేస్తాను' అని పోల్ నిర్వహించిన స్టార్ స్పోర్ట్స్ అప్‌లోడ్ చేసిన వీడియోలో టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఈ పోల్‌లో క్రికెట్ వ్యాఖ్యాతలు మరియు అభిమానులు ఓటు వేశారు. సచిన్, సంగక్కర మధ్య రసవత్తర పోటీ ఉన్నా 21వ శతాబ్దపు గొప్ప బ్యాట్స్‌మన్‌గా మాత్రం చివరికి మాస్టర్ బ్లాస్టర్ నిలిచారు.

51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు:
సుదీర్ఘ ఫార్మాట్లో సచిన్ టెండూల్కర్ మొత్తం 15921 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పరుగులతో పాటు శతకాల పరంగా సచిన్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. పరుగుల విషయంలో అతనికి చేరువలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. సచిన్ కంటే 2543 పరుగులు రికీ తక్కువగా చేశాడు. సెంచరీల విషయానికొస్తే.. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలిస్ చేరువలో ఉన్నాడు. కలిస్ టెస్టుల్లో 45 శతకాలు బాదాడు. ఇక కుమార సంగక్కర 38 సెంచరీలతో 12400 రన్స్ చేశాడు. అత్యధిక పరుగుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు.

100 సెంచరీలు:
16 ఏళ్ల ప్రాయంలో క్రికెట్ ఆటలోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్.. ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశారు. టెస్ట్, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డులు మాస్టర్ బ్లాస్టర్ పేరుపైనే ఉన్నాయి. వన్డేల్లో తొలి డబుల్, క్రికెట్‌లో 100 సెంచరీలు ఇలా ఎన్నో రికార్డులు ఉన్నాయి. విస్డెన్ క్రికెటర్స్ అల్మానాక్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రపంచ ఆల్‌టైమ్ XIలో చోటు సంపాదించిన ఏకైక భారత ప్లేయర్ సచిన్. 2002లో విస్డెన్ క్రికెటర్స్ అల్మానాక్ ప్రకటించిన ర్యాంకుల్లో.. ఆల్‌టైమ్ గొప్ప టెస్ట్ బ్యాట్స్మన్ల జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ తర్వాత లిటిల్ మాస్టర్ పేరును ప్రకటించారు. వన్డేల్లో వివ్ రిచర్డ్స్ తర్వాత సచిన్ పేరును పేర్కొన్నారు.

ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులు:
1989 నుంచి 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచారు. లిటిల్ మాస్టర్ తన కెరీర్ మొత్తంలో 34357 పరుగులు బాదారు. టెస్టుల్లో 15921, వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ చేశారు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












