Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను కాదు, సచిన్ అద్భుతం: అలిస్టర్ కుక్

న్యూడిల్లీ: క్రికెట్లో అద్భుతమైన ఆటగాడిని తాను కాదని, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అని ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ కొనియాడాడు. పిన్న వయస్సులో పదివేల పరుగుల మైలు రాయిని అందుకొని, అంతకుముందు, సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అలిస్టర్ కుక్ తాజాగా మాట్లాడుతూ.. సచిన్ ఓ అద్భుతమైన మేధావి అన్నాడు. తాను కాదని చెప్పాడు. నేను ఇప్పటి వరకు 128 టెస్టు మ్యాచ్‌లాడి 10,042 పరుగులు మాత్రమే చేశానని, సచిన్‌ లాంటి క్రికెట్‌ మేధావి నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డును చేరాలంటే నేను ఇంకా దాదాపు ఆరు వేల పరుగులు చేయాలన్నాడు.

ప్రస్తుతం ఆ లక్ష్యం చాలా దూరంలో ఉన్నట్లేనని చెప్పాడు. ఎందుకంటే నేను సచిన్‌ లాంటి మేధావిని కాదని వ్యాఖ్యానించాడు. సచిన్‌ రికార్డును చేరాలంటే కుక్‌ ఇంకా 5,879 పరుగులు చేయాల్సి ఉందని చెప్పారు. టెస్టుల్లో ఇప్పటి వరకు చేసిన శతకాలు 28 మాత్రమే.

Sachin Tendulkar is an Incredible Genius, I am Not: Alastair Cook

కాగా, ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్‌ కంటే తక్కువ వయసులోనే 10వేల పరుగుల మైలురాయిని అందుకుని సరికొత్త రికార్డును కుక్‌ సృష్టించాడు. కెరీర్‌లో 200 టెస్టు మ్యాచ్‌లాడిన సచిన్‌ 51 శతకాలతో మొత్తం 15,921 పరుగులు చేశాడు.

అయితే ఇప్పటికే 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న 31 ఏళ్ల కుక్‌ ఇంకా టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండటంతో సచిన్‌ అత్యధిక పరుగుల రికార్డును కూడా అధిగమిస్తాడని భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+