Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై రంజీ జట్టుకు సచిన్ క్రికెట్ పాఠాలు

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ సమయం దొరికినప్పుడల్లా ఏదో ఓ రకంగా క్రికెటర్లకు తన విలువైన సూచనలను అందిస్తూనే ఉన్నాడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్. తాజాగా ముంబై రంజీ జట్టుతో పాటు అండ‌ర్ 19 జట్టుకు సచిన్ విలువైన పాఠాలు చెప్పాడు.

ఈ విష‌యాన్ని త‌న్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేష‌న్‌లో ఈ స్పెష‌ల్ సెష‌న్ జ‌రిగింది. ఈ సెష‌న్‌తో కొన్ని పాత జ్ఞాప‌కాలు నెమ‌రేసుకున్న‌ట్లు స‌చిన్ చెప్పడం విశేషం.

'ఎమ్‌సీఏలో ముంబై రంజీ జట్టు, అండర్‌-19 బాలురతో జరిగిన సెషన్‌ ఎంతో గొప్పగా గడిచింది. నా పాత రోజులు గుర్తుకొచ్చాయి. ఈ సందర్భంగా ఆటగాళ్లందరికి ఇవే నా శుభాకాంక్షలు.' అని సచిన్ పేర్కొన్నాడు. అక్టోబర్ 6 నుంచి రంజీ ట్రోఫీ కొత్త సీజ‌న్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Sachin Tendulkar interacts with Mumbai Ranji, U19 team

ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ ముంబై జట్టుకు క్రికెట్ పాఠాలు చెప్పడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను సృష్టించిన సచిన్ టెండూల్కర్, దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువ ఆడలేకపోయాడు. చిన్న వ‌య‌సులోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్ట‌డంతో రంజీల్లో ఆడే అవకాశం సచిన్‌కు రాలేదు.

సచిన్ ఆడిన 38 మ్యాచుల్లోనూ 18 సెంచ‌రీలు, 19 హాఫ్ సెంచ‌రీల‌తో 4281 పరుగులు చేశాడు. చివరిసారిగా ఆగస్టు 2014లో రంజీ క్రికెట్ మ్యాచ్ ఆడిన సచిన్ 79 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హర్యానాపై ముంబై నాలుగు వికెట్లు తేడాతో విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+