సచిన్‌కు మరో అరుదైన గౌరవం: లారెస్ అకాడమీలో చోటు
షాంఘై: క్రికెట్ దేవుడు, భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక లారెస్ ప్రపచం క్రీడా అకాడమీలో మాస్టర్‌కు చోటు లభించింది. సచిన్‌తో పాటు చైనా బాస్కెట్ బాల్ స్టార్ యావో మింగ్, జిమ్నాస్ట్ షియాపింగ్, స్కేటర్ యాంగ్ యాంగ్, కెన్యా మారథాన్ రన్నర్ టెగ్లా లోరోప్‌లను కూడా ఈ జాబితాలో స్ధానం లభించింది.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ "లారెస్ అకాడమీలో చోటు దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నేను చూస్తుండగానే ఎదిగిన వారితో వేదికను పంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది" అని చెప్పాడు. గతంలో భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్‌లు ఈ గౌరవం పొందారు.

బుధవారం జరిగిన ఈ వేడుకల్లో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్, ఇథోపియా స్పింటర్ జెంజెబీ డిబాబాకు లారెస్ స్పోర్ట్స్ మెన్, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు దక్కాయి. ఇక సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు తన సేవలందించాడు.
భారత్ తరుపున 200 టెస్టు మ్యాచ్‌లు, 463 వన్డే మ్యాచ్‌లాడిన ఒకే ఒక ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రమే. ప్రపంచ క్రికెట్లో 100 సెంచరీలు చేసిన ఏకైక వ్యక్తి సచిన్ టెండూల్కరే. వన్డేల్లో అత్యధిక స్కోరు 200 పరుగులు. టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా, వన్డేల్లో 49 సెంచరీలు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications