Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

17 సెకన్లలో తిప్పేశాడు.. సచిన్‌‌ను ఫిదా చేశాడు!!

Sachin Tendulkar impressed Mumbai boy Aiman Koli solves Rubiks Cube without looking at puzzle

ముంబై: రూబిక్స్‌ క్యూబ్‌ గురించి తెలిసిందే. కొందరు గంటల సమయం తీసుకొని సెట్‌ చేస్తే.. మరికొందరు నిమిషాల్లో పూర్తి చేస్తారు. అయితే ఓ యువకుడు మాత్రం కేవలం 17 క్షణాల్లోనే సెట్‌ చేశాడు. అది కూడా రూబిక్స్‌ను చూడకుండా అన్ని వైపులా రంగుల్ని సరిచేశాడు. ఇది చూసిన క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ అతడి ప్రతిభకు ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించి సచిన్‌ షేర్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ముంబైకి చెందిన టీనేజర్‌ మహ్మద్‌ అమన్‌ కొలీకి పజిల్స్‌ సాల్వ్‌ చేయడం అంటే మహా ఇష్టం. ఆ ఆసక్తే అతడిని అందరిలో ప్రత్యేకంగా నిలిపింది. అతడి గురించి తెలుసుకున్న సచిన్ టెండుల్కర్‌‌ తన ఇన్‌స్టా అకౌంట్‌ ద్వారా నెటిజన్లకు పరిచయం చేశాడు. రూబిక్‌ క్యూబ్‌ను సచిన్‌ తికమక చేసి ఇవ్వగా.. అమన్‌ కేవలం 17 సెకన్లలో సరిచేసి ఇచ్చాడు. చూడకుండా తలపై క్యూబ్‌ పెట్టుకుని ఒకే రంగులోకి తీసుకొచ్చాడు. ఈ వీడియోను సచిన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

'నాతో పాటు ఇక్కడ అమన్‌ కొలి ఉన్నాడు. మీ అందరికీ తెలుసు కదా.. దీనిని రూబిక్‌ క్యూబ్‌ అంటారు. దీనిని ఇప్పుడు అమన్‌ చేతికి ఇస్తాను. అతడు దాని వైపు చూడకుండానే సాల్వ్‌ చేస్తాడు. అమన్‌ గిన్నిస్‌ బుక్‌ రికార్డు కూడా సాధించాడు. ఈ భారతీయ యువకుడు మన అందరినీ గర్వపడేలా చేశాడు. మనం నేరుగా చూస్తూ కూడా చేయలేని పనిని అతడు చూడకుండానే చేశాడు. అతని ప్రతిభకు ఆశ్చర్యపోతున్నా. అంత త్వరగా ఎలా చేస్తారనే విషయాన్ని తెలుసుకుంటా' అని సచిన్‌ వీడియోలో చెప్పారు.

సోషల్ మీడియాలో అమన్‌ కొలి వీడియోను వీక్షించిన నెటిజన్లు అతడి ప్రతిభను కొనియాడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం బ్రెట్‌ లీ సైతం స్పదించారు. 'అస్సలు నమ్మలేకపోతున్నా. కవర్‌డ్రైవ్‌ చక్కగా ఉంది' అని లీ ప్రశంసించాడు. సచిన్ షేర్ చేసిన వీడియోకి లక్షల్లో లైకులు, షేర్లు వచ్చాయి.

Story first published: Tuesday, March 2, 2021, 11:43 [IST]
Other articles published on Mar 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+