Holi Celebrations: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా దిగ్గజ క్రికెటర సచిన్ టెండూల్కర్ కూడా రంగులతో సరదాగా, సందడిగా గడిపారు. తోటీ క్రికెటర్లతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

చిన్న పిల్లోడిగా మారి తన స్నేహితలతో కలిసి రంగులు పూసుకుంటూ ఎంతో ఉత్సాహంగా గడిపారు సచిన్ టెండూల్కర్. ఇతర క్రికెటర్ల ఇంటికి వెళ్లి మరీ, వారిపై రంగులు చల్లి హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోల్లో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అంబటి రాయుడు, యూసఫ్ పఠాన్ సహా ఇతర క్రికెటర్లతో కలిసి సచిన్ హోలీ ఆడినట్లు కనిపిస్తోంది.
ఆ లీగ్ లో బిజీగా సచిన్..
సచిన్ టెండూల్కర్.. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో ఆడుతూ బిజీగా ఉంటున్నాడు. యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు కూడా ఈ టోర్నీలో సచిన్ తో పాటు కలిసి ఆడుతున్నారు. భారత జట్టుకు సచిన్ సారథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో భారత్ ఫైనల్ కు అర్హత సాధించింది. ఇకపోతే ఈ టోర్నీలో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లు కూడా బరిలోకి దిగి ఆడారు. అయితే సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు మాత్రం సెమీ ఫైనల్ కూడా చేరుకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి.