ప్రత్యేక షో: సచిన్ సినిమా తొలుత చూసిందెవరో తెలుసా? (ఫోటోలు)
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్'. ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించిన సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాను ఫస్ట్ స్క్రీనింగ్ జరిగింది.
ఈ సినిమాని భారత సాయుధ దళాల కోసం భారత వైమానిక దళ ఆడిటోరియంలో శనివారం ప్రత్యేకంగా ఈ షో వేశారు. ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ గౌరవ కెప్టెన్ సచిన్, ఆయన సతీమణి అంజలి, ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా, బలగాలు తమ కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు.
ట్విట్టర్‌లో షేర్ చేసుకున్న సచిన్
ఇదే విషయాన్ని సచిన్ ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆడియెన్స్‌తో సచిన్ సెల్ఫీ కూడా దిగాడు. థియేటర్‌లో ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆడిటోరియంలో సచిన్ సచిన్ అంటూ హోరెత్తించారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఈ సినిమా వీక్షించిన తర్వాత సచిన్ టెండూల్కర్ ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు.
ఇదే పోడియంపై వైమానికదళ గ్రూప్ గౌరవ కెప్టెన్ అయ్యా
‘ఇదే పోడియంపై నేను భారత వైమానికదళ గ్రూప్ గౌరవ కెప్టెన్ అయ్యాను. ఈ సినిమా రూపొందితే ముందు వైమానిక దళ సిబ్బందితో కలిసి చూడాలనుకొన్నా. అది నెరవేరింది. దేశానికి రక్షణ కోసం పాటుపడుతున్న మీ అందరికీ నేను 120 కోట్ల మంది తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా' అని సచిన్ భావోద్వేగంగా చెప్పారు.

సచిన్‌కు జ్ఞాపికను అందజేసిన ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా
ఇక ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా... సచిన్‌కు ఓ జ్ఞాపిక అందజేశారు. ‘ఇదో అద్భుత చిత్రం. సచిన్ క్రికెట్ ఆడడానికి ముందే నేను ఎయిర్‌ఫోర్స్‌లో చేరా. అతడి కెరీర్ సాంతం చూశాను. అది స్ఫూర్తిదాయకం. సచిన్ సినిమా విడుదలవుతున్న మే 26కు ఒక విశిష్టత ఉంది. కార్గిల్ యుద్ధంలో ఆ రోజే భారత వాయుసేన బరిలోకి దిగింది' అని ధనోవా పేర్కొన్నారు.

మే 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
ఈ సినిమా మే 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హాలివుడ్ దర్శకుడు జెమ్స్ ఎర్సకైన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సచిన్ టెండూల్కర్ జీవితంలో ఎవరికీ తెలియని విషయాలను చూపించారు. ఈ సినిమాకి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించాడు. ఇప్పటికే ఈ సినిమాకి ఛత్తీస్‌గఢ్, కేరళ రాష్ట్రాలు పన్ను మినహయింపు ఇచ్చాయి.
ప్రధాని మోడీ ఆశీర్వాదం
కాగా, శుక్రవారం తన చిత్రం విశేషాలకు సంబంధించిన వివరాలను ప్రధాని మోడీకి క్లుప్తంగా వివరించినట్లు పేర్కొంటూ మోడీతో కరాచలనం చేస్తున్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆశీర్వాదం కూడా తీసుకున్నట్లు సచిన్ అందులో పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications