Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాగపూర్ టెస్టు: టెండూల్కర్ 40వ సెంచరీ

Sachin Tendulkar
నాగపూర్: భారత క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన టెస్టు కెరీర్ లో 40వ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో టెండూల్కర్ ఈ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాపై ఆయనకు ఇదో పదో సెంచరీ. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలుత ఆస్ట్రేలియాను ఎదుర్కోవడానికి తీవ్రంగా ఇబ్బందులు పడింది. తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో సచిన్ కు వివియస్ లక్ష్మణ్ తోడై మంచి సహకారం అందించాడు. లక్ష్మణ్ 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్రేజా బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత సచిన్ కు గంగూలీ తోడయ్యాడు. బ్రెట్ లీ బౌలింగులో జాన్సన్ సచిన్ 85 పరుగుల వద్ద వున్నప్పుడు క్యాచ్ వదిలిపెట్టాడు.

తన తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న విజయ్ 33 పరుగులకు అవుట్ కాగా సెహ్వాగ్ 66 పరుగులు చేశాడు. ద్రావిడ్ డకవుట్ అయ్యాడు. ఈ వార్త సమయానికి సచిన్ 109 పరుగులకు అవుటయ్యాడు. గుంగూలీ 25 పరుగులు చేశాడు. గంగూలీకి ధోనీ తోడయ్యాడు. 85 ఓవర్ల వద్ద భారత్ ఐదు వికెట్లు కోల్పోయి306 పరుగులు చేసింది. క్రేజా మూడు వికెట్లు తీశాడు.
Story first published: Thursday, November 6, 2008, 17:39 [IST]
Other articles published on Nov 6, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+