హార్ట్ బ్రేకింగ్: సచిన్ టెండుల్కర్ ఎమోషనల్ మెసేజ్!

లండన్: ప్రతి క్రికెటర్ తన కేరీర్ మొత్తంలో ఒక్కసారైనా ఆడాలని అనుకునే మెగా టోర్నమెంట్ ఐసీసీ ప్రపంచకప్. అలాంటిది- అద్భుతమైన ఫామ్‌లో ఉండి కూడా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా ఆడలేకపోతున్నాడు. మ్యాచ్‌లన్నింటికీ దూరం అయ్యాడు. ప్రపంచకప్ టోర్నమెంట్‌కు దూరం కావడంతో ఉద్వేగానికి గురయ్యాడు శిఖర్ ధావన్. తన బాధను తెలియజేస్తూ ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. 'బొటనవేలు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు.
దీంతో ప్రపంచకప్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరం అవుతున్నానని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను చూసిన తరువాత టీమిండియా మాజీ కేప్టెన్ సచిన్ టెండుల్కర్ కూడా ఆగలేకపోయాడు. ఆయనా భావోద్వేగానికి గురయ్యాడు. శిఖర్ ధావన్ ప్రపంచకప్‌కు దూరం అయ్యాడనే విషయం తెలిసి, ఈ వీడియో చూసి సచిన్ కూడా ఎమోషన్ అయ్యాడు. ఆయన కూడా తన ట్విట్టర్ ద్వారా ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.
అద్భుతంగా ఆడుతూ, ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ మధ్యలో వైదొలగిన సమచారం విని తనకు గుండె పగిలినంత పనైందని చెప్పుకొచ్చాడు. శిఖర్ ధావన్ స్థానంలో జట్టుకు ఎంపికైన వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కు అభినందనలు తెలిపారు సచిన్ టెండుల్కర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications