హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియతో జరిగిన రెండో వన్డేలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి స్పిన్నర్‌గా.. వన్డేల్లో హ్యాట్రిక్ ఫీట్ నమోదు చేసిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
మొత్తంగా భారత్ తరఫున హ్యాట్రిక్ సాధించిన బౌలర్లలో మూడో బౌలర్‌గా నిలిచాడు. గురువారం ఆస్ట్రేలియాతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో కుల్దీప్ ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ 33వ ఓవర్‌లో కుల్దీప్ ఓ అద్భుతాన్ని చేసి చూపించాడు.
32వ ఓవర్‌లో హ్యాట్రిక్ ఇలా:
32వ 2వ బంతి: కుల్దీప్ ఆఫ్ సైడ్ బంతి వేసి బయటికి స్పిన్ చేయగా.. దానిని కట్ చేసే ప్రయత్నంలో వేడ్ అవుటయ్యాడు.
3వ బంతి: తన కాళ్ల ముందు పడ్డ బంతిని సరిగా అంచనా వేయకుండా ఫ్లిక్ చేసే ప్రయత్నం చేసిన అగర్ వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు.
4వ బంతి: వికెట్ అవతలికి స్పిన్ చేశాడు కుల్దీప్. దీంతో కమిన్స్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి ఎడ్జ్ తీసుకుంది. వెంటనే ధోని వెంటనే క్యాచ్ అందుకున్నాడు. దీంతో కుల్దీప్ హ్యాట్రిక్ సాధించాడు.
అయితే కుల్దీప్ హాట్రిక్ వికెట్లు తీయడం ఇదే తొలిసారి కాదు. అండర్-19 యూత్ వన్డేల్లో కూడా కుల్దీప్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. కుల్దీప్‌కు ముందు వన్డేల్లో 1987లో చేతన్ శర్మ న్యూజిలాండ్‌పై ఈ ఘనత సాధించి తొలి హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత 1991లో ఇదే ఈడెన్‌లో శ్రీలంకపై కపిల్ దేవ్ హ్యాట్రిక్ సాధించాడు.
26 ఏళ్ల తర్వాత మళ్లీ కుల్దీప్ యాదవ్ ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. ఇక టెస్టుల్లో హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్‌లు హ్యాట్రిక్ వికెట్లు తీశారు.