సచిన్ హంగామా, ముసిముసిగా భార్య: రాయుడితో ఫోటో (పిక్చర్స్)
ముంబై: ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 8 టైటిల్ గెలవడంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చాలా ఖుషీగా ఉన్నాడు. సోమవారం రాత్రి ముంబై జట్టు తన సొంత మైదానం వాంఖేడే స్టేడియంలో సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా సచిన్ పలువురు అభిమానులతు సెల్ఫీలు దిగి ఆనందించాడు.
సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు. దీంతో, అతని సంబరాలు అంబరాన్నంటాయి. మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూమ్‌లోనూ జట్టు సభ్యులతో కలిసి జట్టు విజయాన్ని బాగా సెలెబ్రేట్ చేసుకున్నాడు.
అందులో భాగంగా తెలుగు తేజం అంబటి రాయుడుతో కలిసి దిగిన ఫొటోను సచిన్ తన ఫేస్‌బుక్‌లో సోమవారం పోస్ట్ చేశాడు. ఫైనల్లో చెన్నైపై రాయుడు కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఇలాంటి క్షణాలు జీవితంలో కొన్నిసార్లే వస్తాయని, అభిమానుల మధ్యలో ఇలా గెలుపు సంబరాలు చేసుకోవడం మరింత ఆనందంగా ఉందని, మద్దతుగా నిలిచిన అందరికీ తన కృతజ్ఞతలని సచిన్ పేర్కొన్నాడు.
సమష్టి కృషితోనే టైటిల్ గెలిచామని చెప్పాడు. జట్టు సభ్యులకు అవసరమైనప్పుడు తాను సూచనలు చేశానని చెప్పాడు. నేను తిరిగి ఐపీఎల్ ఆడేందుకు రావడం లేదని చెప్పాడు.

ముంబై
ముంబై వాంఖేడే స్టేడియంలో సెలబ్రేషన్స్ సమయంలో సచిన్ టెండుల్కర్ సతీమణి అంజలి, వినయ్ కుమార్ భార్య, రోహిత్ శర్మకు కాబోయే భార్యలు

ముంబై
ముంబై వాంఖేడే స్టేడియంలో సెలబ్రేషన్స్ సమయంలో ఐపీఎల్ 8 టైటిల్ ప్రదర్శిస్తున్న సచిన్ టెండుల్కర్, నీతా అంబానీ, జట్టు సభ్యులు.

ముంబై
ముంబై వాంఖేడే స్టేడియంలో సెలబ్రేషన్స్ సమయంలో ముంబై ఇండియన్స్ పతాకాన్ని గాలిలో రెపరెపలాడిస్తున్న సచిన్ టెండుల్కర్.

ముంబై
ముంబై వాంఖేడే స్టేడియంలో సెలబ్రేషన్స్ సమయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఉత్సాహం. అతనిని చూస్తున్న కుంబ్లే.

సచిన్ టెండుల్కర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పలువురు ఆటగాళ్లతో కలిసి ఫోటోలు దిగాడు. తెలుగు తేజం రాయుడుతో పాటు పలువురి ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టాడు.

ముంబై
సోమవారం రాత్రి ముంబై జట్టు తన సొంత మైదానం వాంఖేడే స్టేడియంలో సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా సచిన్ పలువురు అభిమానులతు సెల్ఫీలు దిగి ఆనందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications