1000పరుగుల ప్రణవ్‌కు సచిన్ కానుక ఇదే(ఫొటో)
ముంబై: 1000 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ముంబై పాఠశాల ఆటగాడు ప్రణవ్ ధనవాడేకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ అరుదైన కానుక అందించాడు. అదే సచిన్ సంతకం చేసిన బ్యాట్.
'మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన సంతకంతో కూడిన బ్యాట్‌ను ప్రపంచ రికార్డు సృష్టించిన ప్రణవ్ ధనవాడేకు అందించాడు' అని బిసిసిఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.

గత మంగళవారం పాఠశాల స్థాయిలో జరిగిన మ్యాచులో 1009 పరుగులు సాధించిన ప్రణవ్ ధనవాడె ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. అదే రోజు సచిన్ టెండూల్కర్.. ధనవాడేకు అభినందనలు తెలిపాడు. బాగా కష్టపడి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించాడు.
కెసి గాంధీ ఇంగ్లీష్ స్కూల్ తరపున ఆడిన ధనవాడె కేవలం 323 బంతుల్లోనే 1000 పరుగులు చేశాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భండారీ కప్ ఇంటర్ స్కూల్ టోర్నమెంటులో భాగంగా జరిగిన మ్యాచులో ఆర్యా గురుకుల్ జట్టుపై ధనవాడే ఈ స్కోరు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications