ముంబై: క్రికెట్ అంటే సచిన్ టెండుల్కర్. సచిన్ టెండుల్కర్ అంటే క్రికెట్. అభిమానులు ఆయనను దేవుడిగా భావిస్తారు. అలాంటి సచిన్‌కు ఓ చిన్న పిల్లాడు క్రికెట్ టిప్స్ చెబితే.. ఎలా ఉంటుంది. అదే అనుభవం ఎదురైంది మాస్టర్ బ్లాస్టర్‌కు.
ఇందుకు సంబంధించిన అంశాన్ని సచిన్ టెండుల్కర్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పంచుకున్నారు. నీ దృష్టి అంతా బంతి పైనే ఉండాలని ఓ లిటిల్ ఛాంపియన్ చెప్పాడని అందులో పేర్కొన్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం సచిన్ వంతయి ఉంటుంది.
క్రికెట్‌కు సంబంధించిన అంశాలను సచిన్ అందరితోను పంచుకుంటారు. యంగ్ స్టర్స్‌కు, చిన్నారులకు అతడు ఎప్పుడు స్ఫూర్తిగా నిలుస్తాడు. అతను అభిమానులకు సామాజిక వేదికల్లో అందుబాటులో ఉంటాడు. ట్విట్టర్లో సచిన్‌కు 12.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.