న్యూఢిల్లీ: శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర పైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు సచిన్‌ను క్రికెట్ దేవుడిగా కొలుస్తురు. అలాంటి సచిన్ పేరును తన 'ఆల్ టైం ఫేవరేట్' జాబితాలో పేర్కొనక వడం సచిన్ ఫ్యాన్స్‌ను ఆగ్రహానికి గురి చేస్తోంది.
100 అంతర్జాతీయ సెంచరీలు కొట్టిన సచిన్ పేరు ఈ జాబితాలో లేనందుకు సంగక్కారను తిట్టి పోస్తున్నారు. అతను ఓ సామాన్య ఆటగాడినేనని నిరూపించుకున్నాడని, శ్రీలంకలో క్రికెట్ దిగ్గజాన్ని కాదని ఒప్పుకున్నాడని అంటున్నారు.
ఆయన ఎంపిక చేసిన చాలా మందికన్నా సచిన్ ఎంతో మెరుగైన ఆటగాడని, ఇది అసలు ఎవరి దృష్టిలోనూ 'ఆల్ టైం ఎలెవన్' అనిపించుకోబోదని విమర్శిస్తున్నారు. భారత ఆటగాళ్లంటే శ్రీలంకకు ఎప్పుడూ చులకనేనని, అతనికి ఇండియన్ బ్రాండ్లతో ఉన్న డీల్స్ ముగిసిపోవడంతోనే, అందరి దృష్టినీ ఇలా చీప్ పబ్లిసిటీతో ఆకర్షించాలని చూస్తున్నాడని ఎద్దేవా చేశారు.

ఇక ఇంటికెళ్లి మందు కొట్టి పడుకోవాలని, సంగక్కర పైన ఉన్న గౌరవం స్థానంలో ద్వేషం మొదలైందని, ఈస్ట్ ఆర్ వెస్ట్ సచిన్ ఈజ్ ది బెస్ట్ అని ట్వీట్లు చేస్తున్నారు. సంగక్కర ఆల్ టైం ఎలెవన్ అంటూ తన ఫేవరేట్ జట్టును ఇటీవల ట్విట్టర్లో పెట్టిన విషయం తెలిసిందే.
కారణం ఇదీ.. సంగక్కర వివరణ
ప్రతి ఒక్కరిని ఓ టీంలో ఉంచడం సాధ్యం కాదని సంగక్కర మరో ట్వీట్ చేశాడు. సచిన్ టెండుల్కరే కాదని, వీరేంద్ర సెహ్వాగ్ కూడా గొప్ప బ్యాట్సుమెన్ అన్నాడు. అలాగే, ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీని మించిన ఆటగాడు కనిపించడం లేదని చెప్పాడు. ఓ టీంలో అందర్నీ చేర్చడం కుదరని చెప్పాడు.