Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చ‌రిత్ర‌లో నిలిచిపోయిన డిసెంబ‌ర్ 18.. అరంగేట్ర మ్యాచ్‌లోనే స‌చిన్ డ‌కౌట్‌

Sachin Tendulkar Duck Out in his debut match

డిసెంబ‌ర్ 18. భార‌త క్రికెట్‌లోనే కాదు అంత‌ర్జాతీ క్రికెట్‌లోనూ చ‌రిత్ర‌లో నిలిచిపోయిన రోజు ఇది. ప్ర‌పంచ వ‌న్డే క్రికెట్‌లో స‌రికొత్త అద్భుతానికి నాంది ప‌లికిన‌ రోజు ఇది. సెంచ‌రీల‌ను హాట్ కేకులు తిన్నంత సులువుగా, ప‌రుగులను బ‌ఠానీలు తిన్నంత తేలిక‌గా, బౌండ‌రీల‌ను బిస్కెట్స్ తిన్నంత ఈజీగా సాధించిడానికి పునాది ప‌డిన రోజు ఇది. అక్క‌డ మొద‌లైన ప్ర‌యాణం దిగ్విజ‌యంగా 24 ఏళ్లపాటు సాగింది. నాడు మొద‌లైన ప్ర‌యాణంతో వ‌న్డే క్రికెట్‌కు స‌రికొత్త ఊపు వ‌చ్చింది.

స‌చిన్ అరంగేట్రం ఈ రోజే

స‌చిన్ అరంగేట్రం ఈ రోజే

స‌రిగ్గా 32 ఏళ్ల క్రితం భార‌త క్రికెట్ దేవుడు స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ ఈ రోజే అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాలో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌తో అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. నాటి మ్యాచ్‌లో ఇండియా, పాకిస్థాన్ వ‌న్డే ఫార్మాట్‌లో త‌ల‌ప‌డ్డాయి. ఆ మ్యాచ్ ద్వారా స‌చిన్ టెండూల్క‌ర్ అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పుడు స‌చిన్ వ‌య‌సు కేవ‌లం 16 సంవ‌త్స‌రాల 8 నెల‌లు. ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్‌తో పాటు సలీల్ అంకోలా, వివేక్ రజ్దాన్ కూడా వన్డేల్లోకి అరంగేట్రం చేశారు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భార‌త్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భార‌త్

అయితే ఆ మ్యాచ్ ప‌లు కార‌ణాల రీత్యా 16 ఓవ‌ర్లు మాత్రమే పెట్టి ఆడారు. అయితే ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవ‌డంతో పాకిస్థాన్ మొద‌ట‌గా బ్యాటింగ్ చేసింది. ఆ మ్యాచ్‌లో నిర్ణీత 16 ఓవ‌ర్ల‌లో పాకిస్థాన్ 7 వికెట్ల న‌ష్టానికి 87 ప‌రుగులు చేసింది. టాప్ స్కోర‌ర్ అయినా సయీద్ అన్వర్ 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భార‌త బౌల‌ర్ల‌లో సలీల్ అంకోలా, మణిందర్ సింగ్ చెరో రెండు వికెట్లు తీయగా, రమణ్ లాంబా ఒక వికెట్ తీశాడు.

అరంగేట్ర మ్యాచ్‌లోనే డ‌కౌట్‌

అరంగేట్ర మ్యాచ్‌లోనే డ‌కౌట్‌

అనంత‌రం 88 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్‌ నిర్ణీత 16 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 80 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో టీమిండియా ఆ మ్యాచ్‌లో 7 ప‌రుగుల తేడాతో ఓడింది. భార‌త్ త‌ర‌ఫున మహ్మద్ అజారుద్దీన్ అత్య‌ధిక ప‌రుగులు చేశాడు. అజారుద్దీన్ 2 ఫోర్ల‌తో 19 బంతుల్లో 21 ప‌రుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్క‌ర్ డ‌కౌట్ అయ్యాడు. కేవ‌లం రెండు బంతులు ఎదుర్కొని అప్ప‌టి పాకిస్థాన్ కెప్టెన్ వకార్ యూనిస్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అలా త‌న అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్‌ను స‌చిన్ డ‌కౌట్‌తో ప్రారంభించాడు.

అనేక రికార్డులు కొల్ల‌గొట్టిన స‌చిన్‌

అనేక రికార్డులు కొల్ల‌గొట్టిన స‌చిన్‌

డ‌కౌట్‌తో వ‌న్డే కెరీర్ ప్రారంభించిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత మాత్రం స‌చిన్ దుమ్ములేపాడు. ఒక్క‌సారి ప‌రుగులు చేయ‌డం మొద‌లు పెట్టాక ఎక్క‌డా ఆప‌లేదు. ఎక్క‌డా వెనుదిరిగి చూసుకోలేదు. ఈ క్ర‌మంలోనే స‌చిన్ అనేక రికార్డులు కొల్ల‌గొట్టాడు. వ‌న్డే క్రికెట్‌లో ఎవ‌రికీ సాధ్యం కాని డ‌బుల్ సెంచ‌రీని మొద‌ట అందుకున్నది స‌చిన్ టెండూల్క‌రే. అలా 24 ఏళ్ల‌పాటు వ‌న్డే, టెస్ట్ క్రికెట్‌ను శాసించాడు మాష్ట‌ర్ బ్లాష్ట‌ర్‌. మొత్తంగా అత్య‌ధిక మ్యాచ్‌లు, అత్య‌ధిక సెంచ‌రీలు, అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు, అత్య‌ధిక ప‌రుగుల రికార్డును త‌న పేరు మీద‌నే లిఖించుకున్నాడు. చివ‌ర‌కు 2012లో వ‌న్డే క్రికెట్ నుంచి, 2013లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి స‌చిన్ వీడ్కోలు తీసుకున్నాడు. త‌న ఫ‌స్ట్ వ‌న్డేను పాకిస్థాన్‌పై ఆడిన స‌చిన్ చివ‌రి వ‌న్డేను కూడా పాకిస్థాన్‌పైనే ఆడాడు. 463 వ‌న్డేలు ఆడిన స‌చిన్ 44కు పైగా స‌గ‌టుతో 18,426 ప‌రుగులు చేశాడు. ఇందులో 49 సెంచ‌రీలు, 96 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఓ డ‌బుల్ సెంచ‌రీ కూడా ఉంది. బౌల‌ర్‌గా కూడా రాణించిన స‌చిన్ వ‌న్డేల్లో 154 వికెట్లు తీశాడు.

Story first published: Saturday, December 18, 2021, 16:39 [IST]
Other articles published on Dec 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+