కరోనా బాధితుల కోసం సచిన్ సాయం.. ఎంతో తెలుసా?!!

పుణే: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజూవారీ కూలీ చేసుకొనే వాళ్లు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులు దొరకక నానా తిప్పలు పడుతున్నారు. అయితే వీరిని ఆదుకునేందుకు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన వంతు సాయం చేసారు.

సచిన్ సాయం రూ.50లక్షలు
కరోనా బాధితుల సహాయార్థం సచిన్ టెండూల్కర్ శుక్రవారం రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల చొప్పున సాయం అందజేయనున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందుకోసం తనవంతుగా ఈ విరాళం ఇస్తున్నానని సచిన్ తెలిపినట్లు ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు.

సహాయం చేయడంలో సచిన్ ఎప్పుడూ ముందే
ఎప్పటినుండో టెండూల్కర్ చాలా ఛారిటీ సంస్థలకు తన వంతు సాయం చేసేవారు. ప్రజలకు సహాయం చేయడంలో ఎప్పుడూ సచిన్ ముందుంటారు. అయితే ఇది ఎప్పుడూ ప్రజల దృష్టికి మాత్రం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటానికి తమ వంతు సాయం అందించేందుకు ఇప్పటికే పలువురు క్రీడాకారులు ముందుకొచ్చారు. పఠాన్ సోదరులు 4000 ఫేస్ మాస్క్‌లను బరోడా పోలీసు మరియు ఆరోగ్య శాఖకు విరాళంగా ఇచ్చారు. పూణేకు చెందిన ఓ సంస్థకు మహేంద్ర సింగ్ ధోనీ ఒక లక్ష్య అందించారు.

దాదా@50
ప్రపంచ చాంపియన్ పీవీ సింధు తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షల విరాళం ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.5లక్షలను అందించినట్టు ఆమె ట్వీట్ చేసింది. రెజ్లర్ బజరంగ్ పునియా, స్ప్రింటర్ హిమదాస్ తమ వేతనాలను విరాళంగా ఇచ్చారు. కరోనా వైరస్ కారణంగా ప్రభావితమైన పేదలను ఆదుకునేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ముందుకొచ్చారు. కోల్‌కతా నగరంలో ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకుంటున్న పేదల దినసరి అవసరాల కోసం రూ.50 లక్షలు ఇచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications