#కీప్‌మూవింగ్ పుష్‌అప్ ఛాలెంజ్: అమర జవాన్ల కుటుంబాలకు బాసటగా సచిన్


హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునుందుకు సచిన్ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆదివారం జరగనున్న 'మారథాన్' ద్వారా అమర జవాన్ల కుటుంబాలకు విరాళాలను సేకరించాలని కంపెనీ భావిస్తోంది.
దాదాపు 18,000 మంది పాల్గొనే ఈ మారథాన్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొననున్నాడు. మొత్తం నాలుగు విభాగాలుగా జరిగే ఈ రేస్‌కు ముందు 'కీప్ మూవింగ్ పుష్-అప్' ఛాలెంజ్‌లో భాగంగా సచిన్ ఐదు నుంచి పది పుష్ అప్‌లను చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చాలెంజ్‌లో సచిన్‌తోపాటు రన్నర్లు కూడా పాల్గొననున్నారు.
ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రతి రన్నర్‌కు వంద రూపాయల చొప్పున ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సురెన్స్, మారథాన్ నిర్వాహకులు అందించనున్నారు. అనంతరం అమరుల కుటుంబాలకు విరాళంగా రన్నర్ల నుంచి కూడా స్వీకరించనున్నారు. దీంతో ఈ మారథాన్‌లో పాల్గొని అమరుల కుటుంబాలకు బాసటగా నిలువాలని ఐడీబీఐ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ పిలుపునిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications