Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎక్కడో తెలుసా?: మళ్లీ క్రీజులోకి సచిన్ టెండూల్కర్

India vs Windies 2018, 2nd ODI : Sachin Tendulkar Is Back To Playing In Different Way | Oneindia
 Sachin Tendulkar Debut On Digital Cricket, Fans Excited

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్.... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. అభిమానులు ముద్దుగా క్రికెట్ దేవుడని పిలుచుకుంటారు. క్రికెట్‌లో ఎన్ని రికార్డులు అయితే ఉన్నాయో... అన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 100 సెంచరీలు, 160కి పైగా హాఫ్ సెంచరీలు, 34 వేలకు పైగా పరుగులు... సచిన్ సాధించిన కొన్ని రికార్డులు.

24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులు

తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులను సృష్టించి, అత్యున్నత శిఖరానికి అధిరోహించాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్ టెండూల్కర్ మళ్లీ క్రీజులోకి అడుగుపెడుతున్నాడు. సచిన్ టెండూల్కర్ మళ్లీ ఆడడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు సచిన్ తన ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేశాడు.

సచిన్ నిజంగా బ్యాటు పట్టుకుని

సచిన్ నిజంగా బ్యాటు పట్టుకుని

ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేయడంతో ఆయన అభిమానుల్లో నూతన ఉత్సాహం కలిగింది. అయితే సచిన్ నిజంగా బ్యాటు పట్టుకుని, తిరిగి క్రీజులోకి అడుగుపెట్టడం లేదు. తాజాగా ‘100MB' పేరుతో ఓ యాప్ తీసుకొచ్చాడు. ఈ యాప్‌లో సచిన్ టెండుల్కర్ సాధించిన రికార్డులతో పాటు మోస్ట్ మెమొరబుల్ మూమెంట్స్‌కి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది.

లైవ్‌లో ఇంటరాక్ట్ అవ్వనున్న సచిన్

లైవ్‌లో ఇంటరాక్ట్ అవ్వనున్న సచిన్

దీంతో పాటు ఈ యాప్ ఉపయోగించే వారితో సచిన్ టెండూల్కర్ లైవ్‌లో ఇంటరాక్ట్ అవుతాడు. సచిన్‌ టెండూల్కర్‌తో పాటు సురేశ్ రైనా, మిథాలీరాజ్ వంటి క్రికెటర్లు కూడా ఈ యాప్ వినియోగించే అభిమానులతో ముచ్ఛటించనున్నారు. ఈ యాప్‌లో లైవ్ క్రికెట్ స్కోర్లు, షెడ్యూల్స్ వంటి వివరాలు, గణాంకాలు అందుబాటులో ఉండబోతున్నాయి.

Story first published: Thursday, October 25, 2018, 17:44 [IST]
Other articles published on Oct 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+