న్యూఢిల్లీ: భారతరత్న సచిన్ టెండుల్కర్‌ను సామాజిక అనుసంధాన వెబ్‌సైట్ ట్విట్టర్‌లో అనుసరిస్తున్న వారి సంఖ్య యాభై లక్షలకు చేరింది. ఈ మార్కు చేరుకున్న రెండో భారత క్రికెటర్ మాస్టర్ బ్లాస్టరే. సచిన్ రిటైరైన తర్వాత కూడా అతని ఫాలోయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.
సచిన్ టెండుల్కర్ కంటే ట్విట్టర్ ఫాలోయర్లలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ముందున్నాడు. ఇప్పటికీ కోహ్లీనే అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ, సచిన్‌ల మధ్య కొద్ది తేడా మాత్రమే ఉంది.

విరాట్ కోహ్లీని ఫాలో అయ్యే వారి సంఖ్య 53,59,129, సచిన్ టెండుల్కర్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య 50,21,667, భారత సార్థి మహేంద్ర సింగ్ ధోనీని ఫాలో అయ్యే వారి సంఖ్య 34,75,514, వీరేంద్ర సెహ్వాగ్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య 33,27,920, యువరాజ్ సింగ్‌ను పాలో అయ్యే వారి సంఖ్య 28,30,629గా ఉంది. ఇది ఫిబ్రవరి 3వ తేదీ వరకు.