Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రిస్మస్‌ తాతగా టీమిండియా క్రికెటర్.. గ్రీటింగ్స్ చెప్పిన రోనాల్డో, జోకోవిచ్‌!!

Sachin Tendulkar, Cristiano Ronaldo, Novak Djokovic wish fans Merry Christmas

హైదరాబాద్: ఈరోజు దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచే ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇందుకు చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. కొత్త సంవత్సరానికి ఆరు రోజుల ముందు వచ్చే ఈ పండుగ కోసం ప్రపంచంలోని క్రైస్తవులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. మన దేశంలో మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ వేడుకలో భాగస్వాములవుతారు. క్రిస్టియన్ సోదరులను శుభాకాంక్షలతో ముంచెత్తుతారు. క్రిస్మస్‌ సందర్భంగా రాయకీయ, సినీ, క్రీడా సెలబ్రిటీలు అభిమనులకు, ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

టీమిండియా మాజీ క్రికెటర్ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌.. క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో వీడియోను పోస్టు చేసిన స‌చిన్‌.. శాంటా క్లాజ్ గెట‌ప్‌లో అలరించారు. 'ప్ర‌తి ఒక్క‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు. సోద‌ర‌భావానికి, సేవ‌భావానికి క్రిస్మ‌స్ పండుగ ఆద‌ర్శంగా నిలుస్తుంది. మనకు వీలైన చిన్న చిన్న చర్యల ద్వారా మ‌న‌తో ఉన్న వారి కోసం ఈ వేడుక‌ను మ‌రింత ప్ర‌త్యేకంగా మారుద్దాం. అందరికీ దీవెనలు లభించాలి' సచిన్ పేర్కొన్నారు.

టీమిండియా క్రికెటర్లు సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ.. ఆసీస్ మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్‌, బ్రెట్‌ లీ.. పోర్చుగీసు ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.. సెర్బియా టెన్నిస్‌ లెజెండ్‌ నోవాక్ జకోవిచ్‌ తదితరులు అభిమనులకు, ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. 'అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు. ఈ పండుగ మంచి భవిష్యత్తుకు దారితీయగలదని కోరుకుంటున్నా' అని క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ట్వీట్ చేశారు.

'అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు. ప్రజలందరికీ పూర్తి ఆరోగ్యం, ప్రేమ, సంతోషాలు లభించాలి' అని క్రిస్టియానో రొనాల్డో పేర్కొన్నారు.

'మెర్రీ క్రిస్మస్‌. ఈ పండుగ జరుపుకొంటున్న వారందరికీ శుభాకాంక్షలు'-నోవాక్ జకోవిచ్

'అందరికీ మెర్రీ క్రిస్మస్‌.. హ్యాపీ హాలీడేస్‌! మిస్‌ యూ మై గర్ల్స్‌'-రోహిత్‌ శర్మ

'మీకు, మీ కుటుంబసభ్యులకు సంవత్సరమంతా సంతోషం, సంతృప్తి, చక్కటి విజయం లభించాలని కోరుకుంటున్నాను. 2021లో అందరూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలి. అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు'-సురేశ్‌ రైనా

'ప్రతి ఒక్కరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు. ఈ సారి పండగను నా తల్లితండ్రులు, కుటుంబంతో కలిసి జరుపుకోవటం, దీనిని మీ అందరితో పంచుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను'-రికీ పాంటింగ్‌

'ప్రతి ఒక్కరికీ మెర్రీ క్రిస్మస్‌, హ్యాపీ న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు! క్రిస్మస్‌ తాత వచ్చే వరకు కాస్త నిద్రపోతా.. బాక్సింగ్‌ డే పరీక్ష వరకు మరి కాసేపు'-బ్రెట్‌ లీ

Story first published: Friday, December 25, 2020, 15:21 [IST]
Other articles published on Dec 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+