Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌ను ట్రోల్ చేసిన ఐసీసీ: దిమ్మదిరిగే సమాధానమిచ్చిన లెజెండ్

Sachin Tendulkar Comes Up With Witty Reply After ICC Trolls Him ! || Oneindia Telugu
Sachin Tendulkar

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్... ప్రపంచ క్రికెట్‌కు పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. రెండు దశాబ్దాల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంపైర్ల తప్పిద నిర్ణయాలకు ఎక్కువ సార్లు బలైన ఆటగాళ్లలో సచిన్ ఒక్కడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

అంపైర్ తప్పుడు నిర్ణయాల వల్ల 99 పరుగుల వద్ద ఎన్నో సార్లు ఔటై పెవిలియన్‌కు చేరాడు. తాజాగా ముంబైలోని టెండూల్కర్-మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీ క్యాంప్‌లో సచిన్, కాంబ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశారు. చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయని, తామిద్దరం ఎప్పుడూ ప్రత్యర్థులుగా ఆడలేదని తెలిపారు.

ఈ సందర్భంగా సచిన్ బౌలింగ్ చేస్తుండగా... కాంబ్లీ బ్యాటింగ్ చేస్తోన్న వీడియోని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అయితే, క్రీజు దాటి వేసిన సచిన్ బంతి వేసిన అంశాన్ని ఈ వీడియోలో గమనించిన ఐసీసీ తన ట్విట్టర్‌లో "మీ ఫ్రంట్ ఫుట్ చూసుకోండి.. అది నో బాల్" అంటూ ట్రోల్‌ చేసింది. ఈ ట్వీట్‌కు సచిన్ తనదైన శైలిలో బదులిచ్చాడు.

"హమ్మయ్య కనీసం ఈ సారి నేను బౌలింగ్ వేశా. బ్యాటింగ్ అయితే చేయలేదు. ఏదేమైనా అంపైర్ నిర్ణయమే ఫైనల్" అని ఐసీసీకి రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సచిన్‌ ట్వీట్‌కు మద్దతుగా అభిమానులు రీట్వీట్లు చేస్తున్నారు.

Story first published: Thursday, May 16, 2019, 18:33 [IST]
Other articles published on May 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+