Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కాంబ్లికి చాలెంజ్‌ విసిరిన సచిన్‌.. వారం రోజులు గడువు.. చాలెంజ్‌ ఏంటో తెలుసా?

Sachin Tendulkar Challenges Vinod Kambli, Gives Him One Week To Get The Job Done

ముంబై: టీమిండియా లెజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ తన చిన్ననాటి స్నేహితుడు, భారత మాజీ జట్టు సహచరుడు వినోద్ కాంబ్లికి ట్విట్టర్ ద్వారా ఓ సవాలు విసిరాడు. అంతేకాదు ఆ చాలెంజ్‌ను పూర్తిచేయడానికి ఓ వారం రోజులు గడువు ఇచ్చాడు. అయితే సచిన్ చాలెంజ్‌ను కాంబ్లి స్వీకరించాడు. వారం రోజుల్లో చాలెంజ్‌ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. విషయంలోకి వెళితే!!

2017లో బాలీవుడ్‌ స్టార్ సింగర్‌ సోనూ నిగమ్‌తో కలిసి సచిన్‌ 'క్రికెట్ వాలీ బీట్ పే' అనే పాటను ఆలపించిన విషయం తెలిసిందే. అయితే అదే పాటకు వారం రోజుల్లో ర్యాప్‌ చేయాలని కాంబ్లికి సచిన్‌ సవాల్‌ విసిరాడు. జనవరి 28 లోగా 'క్రికెట్‌ వాలీ బీట్‌ పే'కు ర్యాప్‌ సాంగ్‌ పాడకుంటే కాంబ్లి తనకు ఏదో రుణపడి ఉంటాడని సచిన్‌ పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో సచిన్ తెలిపాడు.

సచిన్‌-కాంబ్లికి సంబందించిన సంభాషణ వీడియోను లిటిల్ మాస్టర్ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన అబిమానులు వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధానికి ఫిదా అవుతున్నారు. తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'కాంబ్లి ఆల్ ది బెస్ట్' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'కాంబ్లి నువ్ చాలెంజ్‌ గెలుస్తావ్' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు.

2017లో 'క్రికెట్ వాలీ బీట్ పే' సాంగ్‌ సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సాంగ్‌ను పాడిన సమయంలో టీమిండియా తరుపున ప్రపంచకప్‌ ఆడిన ఆటగాళ్లకు అంకితమిస్తున్నట్టు సచిన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. సచిన్‌-కాంబ్లిలు చిన్ననాటి స్నేహితులు. స్కూల్‌ క్రికెట్‌లో ఇద్దరు 664 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి అప్పట్లో చరిత్ర సృష్టించారు.

న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా సచిన్ స్పందించాడు. 'ప్రస్తుతం న్యూజిలాండ్‌ పిచ్‌లపై టెస్టుల్లో భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి. నేను ఆడిన తొలి పర్యటనతో పోలిస్తే.. ఇప్పుడు వాటి స్వభావం చాలా మారింది. మేం 2009లో ఆడటం ఇప్పటికి గుర్తుంది. ఇతర పిచ్‌లతో పోలిస్తే హామిల్టన్‌ పూర్తిగా భిన్నం. ఇప్పటికీ అది అలానే ఉంది. మిగతావి కఠినంగా మారాయి' అని సచిన్‌ అన్నాడు.

Story first published: Wednesday, January 22, 2020, 11:56 [IST]
Other articles published on Jan 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+