దీపావళి సంబరాల్లో సచిన్, బ్రెట్ లీ, జాంటీ రోడ్స్ (వీడియో)


హైదరాబాద్: యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ.. క్రికెట్ అకాడమీలో చిన్నారులకు శిక్షణనిస్తూ.. తరచుగా సోషల్ మీడియాలో చురుకుగా కనిపించే సచిన్ టెండూల్కర్ తాజాగా
దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. సచిన్ ట్విటర్ వేదికగా బ్రెట్‌లీ(ఆసీస్ మాజీ క్రికెటర్), జాంటీ రోడ్స్(దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్)తో కూడిన ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేశాడు.
దీపావళి అంటేనే మిఠాయిలతో సంతోషంగా
స్వీట్ షాట్స్ అనే పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో సచిన్, బ్రెట్‌లీ, జాంటీ రోడ్స్ ముగ్గురు కళ్లు మూసుకొని తాము ఏ స్వీటు తిన్నారో దాని పేరును గుర్తించారు. ఎన్నో నవ్వులు పూయించిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.‘దీపావళి అంటేనే భిన్న రకాల మిఠాయిలతో సంతోషంగా చేసుకునే పండుగ. ఈ దీపావళికి నేను, బ్రెట్‌లీ, జాంటీ రోడ్స్ కొన్ని నవ్వులు, మరికొన్ని మిఠాయిలతో ఆనందంగా పండుగ జరుపుకొన్నాం. ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు' అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.
మిడిలెక్స్ గ్లోబల్ అకాడమీ క్రికెట్ అకాడమీని
సచిన్ ఇటీవల ముంబైలో టెండూల్కర్ మిడిలెక్స్ గ్లోబల్ అకాడమీ పేరుతో ఓ క్రికెట్ అకాడమీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ అకాడమీ నిర్వహణ, పర్యవేక్షణ సచిన్‌కు చెందిన ఎస్టార్టీ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటుగా మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీ కలిసి చూసుకుంటోంది. ఈ అకాడమీ సచిన్ టెండూల్కరే స్వయంగా చొరవ తీసుకుని శిక్షణలో మెలకువలు నేర్పుతుండటం విశేషం.
చిన్నారులను తీర్చిదిద్దే క్రమంలో
7 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సున్న చిన్నారులను తీర్చిదిద్దే క్రమంలో ప్రపంచంలో టాప్ కోచ్‌లు శిక్షణనిస్తున్నారు. ఈ ఆలోచనతో మంచి క్రికెటర్లుగా విశ్వ పౌరులుగా తీర్చిదిద్దాలని సచిన్ ఆలోచన. ఇక్కడ మైదానంలో బాధ్యతలను ఎలా నెరవేర్చాలి. నిజ జీవితానికి మైదానానికి గల వ్యత్యాసమేంటి. అనే అంశాలతో పాటుగా అవే బేసిక్ నియమాలతో.. వారికి చేరవయ్యే విధానాన్ని మారుస్తూ.. క్రికెట్ నేర్పిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications