రేపు చెన్నైకు సచిన్: ఫౌండేషన్ కుర్రాళ్లకు సలహాలు
చెన్నై: చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న కుర్రాళ్లతో శుక్రవారం ఇద్దరు క్రికెట్ లెజెండ్లు ముచ్చటించనున్నారు. ఒకరు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కాగా, రెండో వ్యక్తి ఫౌండేషన్ కోచింగ్ డైరక్టర్ గ్లెన్ మెక్ గ్రాత్.
శుక్రవార నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్, మెక్ గ్రాత్‌లిద్దరూ ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందుతున్న కుర్రాళ్లు తమ సందేహాలను నివృత్తి చేస్తారు. ట్రైనింగ్‌లో ఉన్న యువ ఆటాగాళ్ల ప్రశ్నలకు బదులిస్తారు.

ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెక్‌గ్రాత్ గత కొన్నాళ్లుగా చెన్నైలోనే ఉంటున్నారు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడే రోజుల్లో ప్రాక్టీస్ నిమిత్తం ఫౌండేషన్‌కు వచ్చేవారు.
అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారి సచిన్ టెండూల్కర్ ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌కు వస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజాలైన వీరిద్దరితో కుర్రాళ్లు సంభాషించడమనేది మహదవకాశం అని ఫౌండేషన్ అధికారి ఒకరు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications