Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌లో భారతే ఫేవరెట్‌: సచిన్‌

ICC Cricket World Cup 2019 : Sachin Tendulkar Believes World Cup Pitches Will Be Batting Friendly
Sachin Tendulkar Believes World Cup 2019 Pitches Will Be Batting Friendly

2019 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌, భారత్ జట్లు ఫేవరెట్ అని మాజీ క్రికెటర్లు అన్నారు. తాజాగా ఈ లిస్టులో టీమిండియా మాజీ క్రికెటర్, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్ చేరారు. ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతుండడంతో క్రికెట్ దిగ్గజాలు ఒక్కొక్కరు తమతమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సచిన్ కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఫ్లాట్‌ పిచ్‌లు ఉంటాయి:

ఫ్లాట్‌ పిచ్‌లు ఉంటాయి:

ముంబైలోని ఎంఐజీ మైదానంలో గురువారం సచిన్‌ పేరుతో పెవిలియన్‌ ఎండ్‌ను ప్రారంభించిన సందర్భంగా సచిన్ మీడియాతో మాట్లాడారు. 'ఈ ప్రపంచకప్‌ మంచి వేసవిలో జరగనుంది. గతంలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో పిచ్‌లన్నీ ఫ్లాట్‌గా ఉన్నాయి. సూర్యుడు వెళ్లినా కూడా పిచ్‌లలో ఎలాంటి మార్పు కనపడలేదు. ఇప్పుడు కూడా అలాంటి పిచ్‌లే ఉంటాయి. అలాంటి పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌ సౌకర్యంగా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. వాతావరణంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటే తప్ప పిచ్‌పై ప్రభావం ఉండదు. ఉన్నా కొన్ని ఓవర్ల పాటే ఉంటుంది' అని సచిన్ తెలిపారు.

ఐపీఎల్‌లో రాణిస్తున్నారు:

ఐపీఎల్‌లో రాణిస్తున్నారు:

'ప్రస్తుత ఐపీఎల్ సీజన్-12లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యతో పాటు ఇతర ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. ఇది టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఒక క్రికెటర్‌ ఏ ఫార్మాట్‌లో రాణించినా అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో ఫార్మాట్‌ మారినా పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మలుచుకోగలరు' అని సచిన్ పేర్కొన్నారు.

భారత్‌కు కప్ ఖాయం:

భారత్‌కు కప్ ఖాయం:

'టీమిండియా ఆటగాళ్లంతా ఇప్పటికే సరిపడా క్రికెట్‌ ఆడారు. టెస్ట్, వన్డే, టీ20 అన్నిఫార్మాట్‌లలో రాణించారు. వారు మెరుగుపడాల్సిన అంశాలను ఇప్పటికే తెలుసుకొని ఉంటారు. ప్రపంచకప్‌లో భారతే ఫేవరెట్‌ జట్టు. కచ్చితంగా భారత్‌కు కప్ వస్తుంది' అని సచిన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Story first published: Friday, May 3, 2019, 16:34 [IST]
Other articles published on May 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+