For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్.. కబడ్డీ కబడ్డీ: అభిషేక్ పిలిస్తే భార్యాపిల్లలతో రాక

By Srinivas

ముంబై: ఐపీఎల్ తరహాలో మొదలైన ప్రో కబడ్డీ లీగ్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మద్దతు ప్రకటించాడు. శనివారం ముంబైలో లీగ్ తొలి మ్యాచ్‌కు సచిన్ తన భార్య అంజలి, కుమార్తె సారాలతో కలిసి వచ్చాడు. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఫ్రాంచైజీ యజమాని అభిషేక్‌ బచ్చన్‌ ఆహ్వానం మేరకు ప్రారంభమైన పోటీలకు సచిన్‌ కుటుంబ సమేతంగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా సచిన్ మాట్లాడాడు. 'ఈ క్రీడకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడకు వచ్చా. పాఠశాల స్థాయిలో నేనూ కబడ్డీ ఆడా. మళ్లీ ఇన్నాళ్లకు ఆట చూడటం, మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉంది. ఈ క్రీడలో వేగం, సామర్థ్యం చాలా ముఖ్యమ'ని మాస్టర్ అన్నాడు.

Sachin Tendulkar bats for Pro-Kabaddi league

ఇక ఆరంభ మ్యాచ్‌ల్లో ముంబాతో పింక్‌ పాంథర్‌.. బెంగళూరు బుల్స్‌తో బెంగాల్‌ వారియర్స్‌ తలపడ్డాయి. జైపూర్ పింక్ పాంథర్స్‌ను ముంబై 45-31తో ఓడించింది.

బాలీవుడ్‌ తారాగణం సందడితో తొలి రోజు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. షారుక్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, అమితాబచ్చన్‌, అభిషేక్‌, ఐశ్వర్య తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా ఈ పోటీల్లో విశాఖపట్నానికి చెందిన తెలుగు టైటాన్స్‌ అనే జట్టు కూడా పాల్గొంటోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+