Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో వెంచర్: సచిన్‌తో అల్లు అర్జున్ (ఫోటోలు)

హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కేరళ బ్లాస్టర్స్‌ ప్రాంచైజీలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌లు సహాయజమానులుగా ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా వీరంతా బ్యాడ్మింటన్‌ను ప్రోత్సహించేందుకు గాను ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో బెంగుళూరు బ్లాస్టర్స్ (అంతకముందు బెంగుళూరు టాప్‌గన్స్) ప్రాంఛైజీని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా బెంగుళూరు బ్లాస్టర్స్ జట్టు లోగోతో పాటు 2017 టోర్నీ సీజన్‌లో తదుపరి ప్రణాళికలను వెల్లడించారు.

బ్యాడ్మింటన్ అంటే ఎంతో ఇష్టం: సచిన్

బ్యాడ్మింటన్ అంటే ఎంతో ఇష్టం: సచిన్

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. ఈ ప్రాంఛైజీ ద్వారా బ్యాడ్మింటన్ ప్రమోషన్‌లో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఇటీవలే భారతీయ బ్యాడ్మింటన్ ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ సాధించిందని అన్నాడు. క్రీడలపై ఆసక్తి కనబరచడమే కాకుండా, వాటికి మరింత ప్రాచుర్యం కల్పించాలని అన్నాడు. ఈ క్రీడను మరింతగా ప్రోత్సహించడానికి ఇదే సరైన సమయమని సచిన్ పేర్కొన్నాడు. ఫిట్‌నెస్, స్కిల్‌ను పెంపొందించుకోవడానికి బ్యాడ్మింటన్ క్రీడ ఎంతగానో దోహదపడుతుంది సచిన్ అన్నాడు.

ఎంతో ఆసక్తిగా ఉన్నా: చిరంజీవి

ఎంతో ఆసక్తిగా ఉన్నా: చిరంజీవి

చిరంజీవి మాట్లాడుతూ ఇండియాలో బ్యాడ్మింటన్ ఎదగడం పట్ల తానెంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు. దేశ వ్యాప్తంగా ఉన్న యువతకు బ్యాడ్మింటన్ ఎంతగానో ఆసక్తిని కలగిస్తుందని చెప్పడంలో సందేహాం లేదని తెలిపాడు. బ్యాడ్మింటన్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందన్నాడు.

సంతోషంగా ఉంది: నాగార్జున

సంతోషంగా ఉంది: నాగార్జున

నాగార్జున మాట్లాడుతూ ఈ అద్భుతమైన ప్రాంచైజీలో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. పుట్ బాల్, క్రికెట్ క్రీడలే మాస్ ఫేవరేట్ అని అనుకుంటారు కానీ, బ్యాడ్మింటన్, షటిల్ కూడా అందుకు ఏమాత్రం తీసిపోవని అన్నాడు. ఇలాంటి టోర్నీల వల్ల భారత్‌లో బ్యాడ్మింటన్ టాలెంట్ మరింతగా ప్రకాశిస్తుందని తెలిపాడు.

లెజెండ్స్‌తో భాగస్వామ్యం: అల్లు అర్జున్

లెజెండ్స్‌తో భాగస్వామ్యం: అల్లు అర్జున్

అల్లు అర్జున్ మాట్లాడుతూ లెజెండ్స్‌తో కలిసి బెంగుళూరు బ్లాస్టర్స్ జట్టులో భాగస్వామ్యం అయినందుకు ఎంతో గర్వంగా ఉందన్నాడు. 2017 సీజన్‌లో బెంగుళూరు బ్లాస్టర్స్ జట్టు అద్భుతమైన జట్టు అవుతుందని, టాలెంట్ ఉన్న ఆటగాళ్లు బెంగుళూరు జట్టు సొంతమని కొనియాడాడు.

బెంగుళూరు అత్యుత్తమ జట్టు: నిమ్మగడ్డ ప్రసాద్

బెంగుళూరు అత్యుత్తమ జట్టు: నిమ్మగడ్డ ప్రసాద్

చివరగా నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడకు పెద్ద అభిమానినని చెప్పాడు. బెంగుళూరు జట్టుకు సహాయజమానిగా వ్యవహరించడం సంతోషంగా ఉందన్నాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌‌లో బెంగుళూరు జట్టు అత్యుత్తమ జట్టుగా నిలిచేందుకు గాను తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐఎస్ఎల్‌లో కేరళ బ్లాస్టర్స్ జట్టు ఏవిధంగా అయితే రాణిస్తుందో అదే విధంగా బ్యాడ్మింటన్‌లో ఈ జట్టు సత్తా చాటుతుందని అన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+