న్యూఢిల్లీ: ప్రస్తుతం విదేశీ పర్యటనలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ చెరువులో భారతదేశాన్ని చూశారు. చెరువులో భారతదేశం కనిపించలేదు గానీ, చెరువే భారతదేశ పటంలా ఉంది. అందుకే, ఆ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు సచిన్.
ఆ చెరువు భారతదేశ మ్యాప్‌లా ఉండటంతో సచిన్ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ ఫొటోను ట్విట్టర్ పోస్ట్ చేసి ఈ విధంగా వ్యాఖ్యానించారు. 'నా ప్రయాణంలో ఓ ఐలాండ్‌కు ఇక్కడ నీటితో నిండిన ఓ చెరువు భారతదేశ మ్యాప్‌ను పోలి ఉంది. సారే జహాసే అచ్ఛా హిందుస్థాన్ హమారా!' అంటూ ట్వీట్ చేశాడు.
గత కొన్ని రోజుల నుంచి విదేశీ పర్యటనలో ఎంజాయ్ చేస్తున్న సచిన్ టెండూల్కర్.. ఆనందంగా గడిపిన క్షణాలను సామాజిక అనుసంధాన వేదికల ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నాడు.