|
సచిన్ ప్రశంసలు
కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం పట్ల సచిన్ స్పందించారు. కెప్టెన్గా అద్భుతంగా రాణించావంటూ కోహ్లీకి అభినందనలు తెలిపారు. జట్టు కోసం విరాట్ 100 శాతం కృషి చేశాడని కొనియాడారు. అంతేకాకుండా భవిష్యత్లో విరాట్ కోహ్లీకి అంతా మంచే జరగాలని సచిన్ టెండూల్కర్ ఆకాంక్షించారు.
|
సగర్వంగా ముందుకు వెళ్లు
విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీ సగర్వంగా తలెత్తుకుని ముందుకు వెళ్లొచన్నారు. భారత జట్టుకు అత్యంత విజయవంతమైన, దూకుడైన కెప్టెన్ విరాట్ కోహ్లీనే అని కొనియాడారు. కెప్టెన్గా కోహ్లీ లాంటి అద్భుత విజయాలు కొంత మందికే సాధ్యమవుతాయని చెప్పుకొచ్చారు. తామిద్దరం కలిసి టీమిండియాను శక్తివంతంగా తీర్చిదిద్దామని గుర్తు చేసుకున్నారు. అయితే వ్యక్తిగతంగా కోహ్లీ కెప్టెన్సీ తప్పుకోవడంతో తనకు ఇది అత్యంత విచారకరమైన రోజు అని రవిశాస్త్రి చెప్పారు. అంతేకాకుండా విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అతడితో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
|
వసీం జాఫర్ ప్రశంసలు
ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ కూడా ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్గా విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో టీమిండియా మంచి విజయాలు సాధించిందని కొనియాడాడు. అయితే సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవ లేకపోయినందుకు బాధగా ఉందని చెప్పుకొచ్చాడు. అయితే జట్టు కోసం కోహ్లీ చాలా చేశాడని జాఫర్ కొనియాడాడు. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, ఐసీసీ, బీసీసీఐ సెక్రటరీ జైషా, రవిచంద్రన్ అశ్విన్ కూడా కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. కోహ్లీ టెస్టు విజయాల గురించి అభినందిస్తూ ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ కూడా పెట్టింది.