Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమెరికాలో క్రికెట్ ఫీవర్, ‘గ్లోబలైజ్ క్రికెట్’: సచిన్

న్యూయార్క్: క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్-షేన్ వార్న్ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న 'ఆల్ స్టార్స్ టీ20 టోర్నీ'తో అమెరికాకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఇప్పుడు ఆ టోర్నీ కోసం ప్రపంచ క్రికెట్ మాజీ దిగ్గజాలందరూ అక్కడే ఉన్నారు.

ఈ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ న్యూయార్క్‌లో జరగనుండగా, తదుపరి మ్యాచులు హూస్టన్, లాస్ ఏంజిల్స్‌లు వేదికలు కానున్నాయి. క్రికెట్ పట్ల అంత ఆసక్తి చూపని అమెరికాలో క్రికెట్‌కు క్రేజ్ తీసుకొచ్చేందుకు 'ఆల్ స్టార్స్ టీ20 టోర్నీ' నిర్వహిస్తున్నట్లు సచిన్ టెండూల్కర్ చెప్పాడు. క్రికెట్‌ను గ్లోబలైజ్ చేయడమే తమ లక్ష్యమని సచిన్ పేర్కొన్నాడు.

Sachin Tendulkar in America: We are here to globalise cricket

ఈ టోర్నీలో పాల్గొనే రెండు జట్లకు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్‌లు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. అమెరికాలో ఫుట్‌బాల్ క్రీడకు పాపులార్టీ తీసుకొచ్చేందుకు డేవిడ్ బెక్‌హామ్ ఎలా చేశాడో.. ఇప్పుడు సచిన్, వార్న్‌లు కూడా అదే బాట పడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ శనివారమే(నవంబర్7న) న్యూయార్క్‌లో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఫుట్‌బాల్ తర్వాత పాపులర్ గేమ్ లిస్టులో క్రికెట్ రెండో స్థానంలో ఉంది. కానీ, అమెరికాలో బేస్‌బాల్‌కు క్రేజీ ఎక్కువ. అయినా క్రికెట్‌ను అక్కడివాళ్లకు పరిచయం చేసేందుకు ఆ గేమ్ దిగ్గజాలు రంగంలోకి దిగారు.

సచిన్స్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ జట్లు ఇక అమెరికన్లకు క్రికెట్ థ్రిల్స్‌ను అందించనున్నారు. 'మళ్లీ అమెరికాకు వచ్చినప్పుడు ఇక్కడి పిల్లలు క్రికెట్ బ్యాట్ పట్టడం చూడాలి' అని సచిన్ అభిప్రాయపడ్డాడు. అమెరికా పిల్లల్లో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు మేటి క్రికెటర్లంతా ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేయనున్నారు.

న్యూయార్క్, హూస్టన్, లాస్ ఏంజిల్స్‌లో ఉన్న బేస్‌బాల్ స్టేడియాల్లో ఈ టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చిన డబ్బును అమెరికాలో క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు వినియోగిస్తారు. క్రికెట్‌ను ఇష్టపడే దేశాలకు చెందిన క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్‌లను చూసేందుకు భారీగా తరలివచ్చే అవకాశాలున్నాయి.

Sachin Tendulkar in America: We are here to globalise cricket

జట్ల వివరాలు:

సచిన్ బ్లాస్టర్స్: సచిన్ టెండూల్కర్(కెప్టెన్), సౌరవ్ గంగూలీ, వివియస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, కార్ల్ హూపర్, కర్ట్‌లీ ఆంబ్రూస్, గ్లెన్ మెగ్రాత్, మోయిన్ ఖాన్, షోయబ్ అక్తర్, మహేలా జయవర్ధనే, ముత్తయ్య మురళీధరన్, లాన్స్ క్లూసేనర్, షాన్ పొలాక్, గ్రేమ్ స్వాన్.

వార్న్ వారియర్స్: షేన్ వార్న్(కెప్టెన్), అజిత్ అగార్కర్, జాంటీ రోడ్స్, మాథ్యూ హేడన్, కర్ట్నీ వాల్ష్, అలన్ డోనాల్డ్, డానియల్ వెటోరీ, రికీ పాంటింగ్, మైఖేల్ వాన్, వాసీం అక్రమ్, కుమార సంగక్కర, సక్లేన్ ముస్తక్, ఆండ్రూ సైమండ్స్, జాక్వెస్ కల్లిస్.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+